Kannappa Movie : క‌న్న‌ప్పపై భారీ ఆశ‌లు పెట్టుకున్న మంచు ఫ్యామిలీ… తేడా కొట్టిందో అంతే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kannappa Movie : క‌న్న‌ప్పపై భారీ ఆశ‌లు పెట్టుకున్న మంచు ఫ్యామిలీ… తేడా కొట్టిందో అంతే..!

 Authored By ramu | The Telugu News | Updated on :17 December 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Kannappa Movie : క‌న్న‌ప్పపై భారీ ఆశ‌లు పెట్టుకున్న మంచు ఫ్యామిలీ... తేడా కొట్టిందో అంతే..!

Kannappa Movie : మంచు మోహ‌న్ బాబు న‌టుడిగా, నిర్మాత‌గా సినీ ప‌రిశ్ర‌మ‌లో స‌త్తా చాటారు. హీరోగానే కాకుండా స‌పోర్టింగ్ పాత్ర‌ల‌లో కూడా న‌టించి మెప్పించారు. మోహ‌న్ బాబు న‌టుడిగా ఇండ‌స్ట్రీలో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్నా ఆయ‌న పిల్ల‌లు ఒక్క‌రు కూడా ప్రేక్ష‌కుల‌ని అంత‌గా అల‌రించ‌లేక‌పోయారు. మంచు విష్ణు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి 20 ఏళ్లు పూర్తి అయింది. మొదటి పదేళ్లు స్పీడ్‌గా సినిమాలు చేసి, పర్వాలేదు అన్నట్లు ఫలితాలు సొంతం చేసుకున్న విష్ణుకు కొన్ని సూపర్‌ హిట్‌లు సైతం దక్కాయి. కానీ గత పదేళ్లుగా ఒక్క సినిమా సైతం హిట్‌ కాలేదు. పైగా ప్రతి సినిమా డిజాస్టర్‌, అంతకు మించి అన్నట్లుగా దారుణ ఫలితాలను చవిచూశాయి. విభిన్న చిత్రాలను ఎంపిక చేసుకుని, ప్రతి సినిమాకు చాలా కష్టపడుతున్నా మంచు విష్ణుకు ఆశించిన సక్సెస్ మాత్రం రావడం లేదనిపిస్తుంది.

Kannappa Movie క‌న్న‌ప్పపై భారీ ఆశ‌లు పెట్టుకున్న మంచు ఫ్యామిలీ తేడా కొట్టిందో అంతే

Kannappa Movie : క‌న్న‌ప్పపై భారీ ఆశ‌లు పెట్టుకున్న మంచు ఫ్యామిలీ… తేడా కొట్టిందో అంతే..!

Kannappa Movie పెద్ద రిస్కే..

ఈసారి ఏకంగా భారీ బడ్జెట్‌తో ‘కన్నప్ప’ అనే సినిమాను చేస్తున్నారు. మొదట్లో అనుకున్న స్థాయికి రెట్టింపు కన్నప్ప బడ్జెట్ చేరినట్టుగా కనిపిస్తోంది. భారీ క్యాస్టింగ్‌తో కన్నప్పను గ్రాాండ్ లెవెల్లో విష్ణు నిర్మిస్తున్నాడు. 150 కోట్లు బడ్జెట్ ను పెట్టి ‘కన్నప్ప అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఇప్పుడు ఇది భారీ గ్రాఫికల్ సినిమాగా తెరకెక్కుతున్నప్పటికీ ఈ సినిమాలో చాలామంది పాన్ ఇండియా ఆర్టిస్టులను తీసుకున్నట్లుగా తెలుస్తుంది.ఇక దాంతో బడ్జెట్ అనేది భారీగా పెరుగింది.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మంచు విష్ణు మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించి సక్సెస్ సాధించాలనే ఉద్దేశ్యం తో ఉన్నట్టుగా తెలుస్తుంది.

సినిమాని డిస్ట్రిబ్యూట‌ర్స్ భారీగా చెల్లించి తీసుకుంటారు అనే న‌మ్మ‌కం లేదు. కన్నప్పను డిస్ట్రిబ్యూటర్స్ కొంటారనే నమ్మకం లేదు. ఒకవేళ కొన్నా.. చాలా తక్కువ ధర ఆఫర్ చేస్తారు. ప్రేక్షకులు సినిమాకు వస్తారనే నమ్మకంతో కన్నప్ప మూవీని నిర్మిస్తున్నారు. స్టార్ హీరోల క్యామియోలు, గెస్ట్ రోల్స్ సినిమాను కాపాడతాయి అనుకుంటే పొరపాటే. ఇది చాలా సందర్భాల్లో రుజువైంది. ఏ విధంగా చూసినా కన్నప్ప మంచు ఫ్యామిలీకి భారీ రిస్క్ చేస్తున్నారు. ఏ మాత్రం తేడా కొట్టిన కూడా క‌న్న‌ప్ప చిత్రం మంచు ఫ్యామిలీకి తీర‌ని విషాదాన్ని మిగ‌ల్చ‌డం ఖాయం.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది