Kantara Movie : అచ్చం కాంతార సినిమాలో లాగానే మన దగ్గర కూడా జరిగింది .. ఆత్మలతో మాట్లాడుతున్నారు చూడండి !
Kantara Movie : సినిమా కథలు కొన్ని కల్పితాలు కాగా కొన్ని మన చుట్టూ జరిగే కథనాలతోనే సినిమాలు చేస్తుంటారు. ముఖ్యంగా మనం ఆరాధించే దేవతల గురించి కూడా సినిమాల్లో ప్రస్థావిస్తారు. లేటెస్ట్ గా వచ్చిన కాంతార మూవీ కూడా అలాంటి కోవలోనే వచ్చింది. కన్నడలో తెరకెక్కిన కాంతార మూవీ పాన్ ఇండియా మూవీగా బీభత్సం సృష్టించింది. తెలుగులో కూడా కాంతార సరికొత్త రికార్డులు సృష్టించింది. రిషబ్ శెట్టి దర్శకత్వం చేసిన ఈ సినిమాలో అతనే హీరోగా నటించాడు. అనాదిగా వస్తున్న ఆచారం ని తెర మీద ఆవిష్కరించిన తీరు అదరగొట్టేసింది.
ఇక ఈ సినిమా చూశాక ఇలా జరుగుతుందా అన్న అనుమానాలు ఏర్పడ్డాయి. ఐతే రిషబ్ శెట్టి తన సొంత గ్రామంలో కొన్ని దశాబ్ధాల క్రితం ఇలాంటివి జరిగాయని వాటి ఆధారంగానే ఈ సినిమా కథ రాసుకున్నానని అన్నారు. కర్ణాటకలో ఒక తెగకి సంబందించిన వారు డ్యాన్స్ చేస్తూ కులదైవాన్ని ప్రార్ధిస్తారు. ఆ టైం లొ వారి పూర్వీకుల ఆత్మలు వాళ్లని ఆవహించి జరుగబోయే వాటి గురించి చెబుతారని అంటున్నారు. కర్ణాటకలో ఈ విషయాల మీద డిస్కషన్స్ నడుస్తుంటాయి. కాంతార సినిమా వల్ల ఇది అందరికి తెలిసేలా చేసింది. సినిమాలో రిషబ్ శెట్టి చూపించినట్టుగానే నిజ జీవితంలో కూడా జరిగినట్టు చెబుతున్నారు.
సినిమాలో ఏది నిజం ఏది కల్పితం అన్నది పక్క్కన పెడితే కాంతార మూవీ మాత్రం ప్రేక్షకులను ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లిందని మాత్రం చెప్పొచ్చు. సినిమాలో రిషబ్ శెట్టి నటనకు నేషనల్ అవార్డ్ వచ్చినా ఆశ్చర్య పోవాల్సిన పని లేదని చెప్పుకుంటున్నారు. సినిమాలో ప్రతిదీ చాలా నీటుగా హ్యాండిల్ చేశారు. అందుకే సినిమా అంత గొప్ప విజయాన్ని అందుకుంది. కాంతార రీసెంట్ గా ఓటీటీ కూడా రిలీజైంది. ఓటీటీలో కూడా మూవీ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. మొన్నటిదాకా వరాహరూపం సాంగ్ వివాదం ఉండగా కోర్ట్ క్లియరన్స్ తో ఆ సాంగ్ కూడా ఇప్పుడు అందరు చూసే అవకాశం కలిగింది.