Karthika Deepam Doctor Babu : ఏమైనా అడగాలనుకుంటే అడిగేయండి.. కార్తీక దీపం డాక్టర్ బాబు ఆఫర్
Karthika Deepam Doctor Babu : కార్తీక దీపం సీరియల్‌తో డాక్టర్ బాబుగా నిరుపమ్ పరిటాల తెలుగు ప్రేక్షకులను కట్టి పడేశాడు. అలాంటి నిరుపమ్ ఇప్పుడు కార్తీక దీపం సీరియల్‌కు దూరమయ్యాడు. ఆ సీరియల్ కథ అంతా మారింది. కొత్త జనరేషన్ వచ్చింది. డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత పాత్రలు ముగిసిపోయాయి. కొత్త కొత్త పాత్రలు వచ్చాయి. మొత్తానికి ఆ సీరియల్ గాడి తప్పింది. డాక్టర్ బాబు, వంటలక్కలు కనిపించకపోవడంతే ప్రేక్షకులు అంతగా సీరియల్‌ను పట్టించుకోవడం లేదు. అయితే నిరుపమ్ కూడా మరో కొత్త సీరియల్‌ను అంగీకరించలేదు. ఇప్పుడు నిరుపమ్ ఖాళీగానే ఉంటున్నాడు. అటు జీ తెలుగు హిట్లర్ గారి పెళ్లాం సీరియల్ ముగిసింది.
ఇటు స్టార్ మా కార్తీక దీపం కూడా ఖతమైంది. అలా మొత్తానికి బుల్లితెరపై నిరుపమ్ కనిపించడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం నిరుపమ్ సందడి కనిపిస్తోంది. ఇన్ స్టాగ్రాంలో నిరుపమ్ హంగామా కొనసాగుతూనే ఉంది. యూట్యూబ్‌లో భార్య భర్తలిద్దరూ కలిసి వీడియోలు చేస్తున్నారు. వ్యూస్, సబ్ స్క్రైబర్ల విషయంలో మంజుల నిరుపమ్ యూట్యూబ్ చానెల్ దూసుకుపోతోంది. రకరకాల వీడియోలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. అయితే ఇందులో ఎక్కువగా పర్సనల్ విషయాలను పంచుకుంటూ ఉంటారు. నిరుపమ్ ఇంటిని చూపిస్తుంటారు. మంజుల అయితే ఎప్పుడూ తన ఇంట్లోనే, తన అపార్టెమ్మెంట్‌లోనే వీడియోలు చేస్తుంటుంది.

Karthika Deepam Doctor Babu On Youtube Channel Promotion
తన కొడుకు రిక్కీ గురించి ఎక్కువగా చెబుతుంది. అలా వ్యక్తిగత విషయాలు చెబుతుండటంతో ఆ వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఇక వెకేషన్లకు వెళ్లిన సమయంలోనూ వీడియోలు చేస్తుంటారు. తాజాగా కొత్త కాన్సెప్ట్‌తో రాబోతోన్నారు. అభిమానులు ప్రశ్నలు అడగండి.. ఏమైనా అడగాలనుకుంటే అడిగేయండి.. వాటన్నంటికి ఓ వీడియో ద్వారా సమాధానం చెబుతాం.. అది ఈ వారం యూట్యూబ్ చానెల్లో అందుబాటులోకి తెస్తామని నిరుపమ్ పరిటాల చెప్పుకొచ్చాడు. దీంతో నిరుపమ్ ఫ్యాన్స్ ఎలాంటి ప్రశ్నలు వేస్తారా? అన్న ఆసక్తి నెలకొంది.