Karthika Deepam Doctor Babu : ఆ సమయంలో మాత్రం నరకం చూశా.. అలా వ్యాధి తగ్గిపోయింది.. డాక్టర్ బాబు భార్య కామెంట్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Deepam Doctor Babu : ఆ సమయంలో మాత్రం నరకం చూశా.. అలా వ్యాధి తగ్గిపోయింది.. డాక్టర్ బాబు భార్య కామెంట్స్

 Authored By prabhas | The Telugu News | Updated on :10 June 2022,9:30 pm

బుల్లితెరపై డాక్టర్ బాబుగా నిరుపమ్ ఎంతటి క్రేజ్ సంపాదించుకున్నాడో అందరికీ తెలిసిందే. అయితే అతని భార్య మంజులకు మాత్రం అంతటి గుర్తింపు రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం నిరుపమ్ భార్యగా, డాక్టర్ బాబు భార్యగా మంజులకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక అడపాదడపా సీరియల్స్ చేస్తూ వస్తోంది. కానీ హీరోయిన్‌గా సీరియల్స్ చేయడం లేదు. మొత్తానికి నిరుపమ్ బ్రాండ్‌‌తో మంజుల ఓ యూట్యూబ్ చానెల్ పెట్టేసింది. మంజుల నిరుపమ్ అనే ఈ యూట్యూబ్ చానెల్ బాగానే నడుస్తోంది.ఈ మధ్య ఈ ఇద్దరూ కలిసి ఓ వీడియోను పెట్టారు. అందు‌లో తమ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

ఈ సమాధానాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ మధ్య ఈటీవీ షోకు వచ్చిన సమయంలో మంజుల తన వ్యాధి గురించి, పడ్డ ఇబ్బందుల గురించి చెప్పింది. చచ్చిపోతానేమో అనిపించింది, నరకం చూశాను అని చెబితే.. సోషల్ మీడియాలో రకరకాలుగా అది స్ప్రెడ్ అయింది. మొత్తానికి ఆ విషయం మీద ఎక్కువ మంచి అభిమానులు ప్రశ్నించారట. ఆ వ్యాధి ఎలా తగ్గింది? ట్రీట్మెంట్ ఏంటి? అని అడిగారట. తనకు వచ్చింది వైరల్ ఆర్థరైటిస్ అని, దానికి ట్రీట్మెంట్ ఏమీ ఉండదని, అలా వస్తుంది. కొన్ని రోజులు ఇబ్బంది పెడుతుంది.. మళ్లీ వెళ్తుంది. అలా ఓ నాలుగైదు వారాలు గడిచినా వెళ్లకపోతే అది వైరల్ ఆర్థరైటిస్ కాదని,

Karthika Deepam Doctor Babu Nirupam Wife Manjula About Her Viral Arthritis

Karthika Deepam Doctor Babu Nirupam Wife Manjula About Her Viral Arthritis

అప్పుడు మ్యాటర్ సీరియస్ అని, వెంటనే డాక్టర్‌ను సంప్రదించాల్సిందేనని మంజుల చెప్పుకొచ్చింది. అయితే ఆ కొన్ని రోజులు మాత్రం నరకం చూశానని, కానీ ఆ తరువాత తగ్గిపోయిందని మంజుల చెప్పుకొచ్చింది. అందరూ ట్రీట్మెంట్ ఎక్కడ చూసుకున్నారని అడిగారు.. నేను యశోదలో చూపించుకున్నాను అని మంజుల తెలిపింది. మొత్తానికి మంజుల వ్యాధి మాత్రం నెట్టింట్లో ఆ మధ్య హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు ఇలా క్లారిటీ ఇచ్చేసింది. ఇప్పుడు తానైతే క్షేమంగా ఉన్నానని తన అభిమానులకు మరోసారి స్పష్టంగా చెప్పుకొచ్చింది మంజుల. ఇక ఈ వీడియోలో ఇంకా ఎన్నో విశేషాలను పంచుకున్నారు.

YouTube video

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది