Keerthy Suresh : తిరుమల తిరుపతిలో ఫ్యాన్స్ తో హల్ చల్ చేసిన కీర్తి సురేష్ వీడియో వైరల్..!!
Keerthy Suresh : హీరోయిన్ కీర్తి సురేష్ అందరికి సుపరిచితురాలే. ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ అందరిలో వెండితెరపై ఎటువంటి పాత్ర అయినా చేయటంలో కీర్తి సురేష్ నీ మించిన హీరోయిన్ మరొకరు లేరని చెప్పవచ్చు. “మహానటి” మొదలుకొని నిన్నటి “దసరా” వరకు ప్రతి సినిమాలో అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో స్క్రీన్ మీద నటన విశ్వరూపం చూపించడం జరిగింది. దసరా సినిమాలో వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ నటన నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. అంతలా చెలరేగిపోయింది.
డీ గ్రేడ్ పాత్ర అయినా గాని… పెర్ఫార్మెన్స్ విషయంలో ఏమాత్రం తగ్గేదేలే అన్న విధంగా సినిమా విజయం సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించింది. దక్షిణాది సినిమా రంగంలో అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న కీర్తి సురేష్ తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఆమెను చూడటానికి అభిమానులు ఎగబడి సెల్ఫీలు దిగటం జరిగింది. సాంప్రదాయబద్ధంగా చీరకట్టులో తిరుమల తిరుపతిలో కీర్తి సురేష్…
తాజా వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఆమెతో ఫోటోలు దిగటానికి అభిమానులు ఎగబడిపోయారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది ఆమెను కాపాడటానికి అనేక తంటాలు పడ్డారు. కీర్తి సురేష్ తెలుగు తో పాటు తమిళంలో… ఇంకా మలయాళం లో భారీ ప్రాజెక్టులలో సినిమాలు చేస్తూ ఉంది. 2022కు ముందు పరాజయాలలో ఉన్న కీర్తి సురేష్ “సర్కారు వారి పాట”తో… ఆ తర్వాత ఈ ఏడాది దసరా సినిమాతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ లు తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. కెరియర్ పరంగా కీర్తి సురేష్ ప్రస్తుతం మంచి జోరు మీద ఉంది.