Kiraak Rp : నా చేపల పులుసు అలాగే అమ్ముతా.. ఇష్టం ఉంటేనే తీసుకోండి.. కిర్రాక్ ఆర్పి…!
ప్రధానాంశాలు:
Kiraak Rp : నా చేపల పులుసు అలాగే అమ్ముతా.. ఇష్టం ఉంటేనే తీసుకోండి.. కిర్రాక్ ఆర్పి...!
Kiraak Rp : తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల కామెడీ ప్రోగ్రామ్స్ వచ్చినప్పటికీ వాటిలో జబర్దస్త్ చాలా ప్రత్యేకమైనది అని చెప్పాలి. ఇక ఈ కామెడీ షో ద్వారా ఎంతోమంది నటీనటులు గుర్తింపు సాధించారు. ఇక ఈ జబర్దస్త్ షో ద్వారా వెండితెర పైకి అడుగుపెట్టిన సుధీర్, షకలక శంకర్ , గెటప్ శీను, హైపర్ ఆది వంటి వారు ఇప్పుడు వరుసగా సినిమాలను కూడా చేస్తున్నారు. అయితే బుల్లితెరపై జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన వారిలో కిర్రాక్ ఆర్పి కూడా ఒకరు అని చెప్పాలి. జబర్దస్త్ లో టీం లీడర్ గా వ్యవహరించిన కిర్రాక్ ఆర్పి ఎన్నో మంచి కామెడీ స్కిట్లను ప్రేక్షకులు ముందు తీసుకొచ్చాడు. అలా కొన్నాళ్లపాటు జబర్దస్త్ లో కొనసాగిన ఆర్పి జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో జబర్దస్త్ కిర్రాక్ ఆర్పి ఫుడ్ బిజినెస్ ను మొదలుపెట్టారు. అయితే ఆర్పి బిజినెస్ మొదలుపెట్టినప్పుడు జబర్దస్త్ నుంచి నటీనటులు కూడా ఎంతోమంది అక్కడకు వెళ్లడం జరిగింది.
అంతేకాక అతి తక్కువ సమయంలోనే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు చాలా ఫేమస్ అవడంతో ఆర్పి బిజినెస్ కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుందని చెప్పాలి. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆర్పి తన ఫుడ్ బిజినెస్ గురించి ఆసక్తికర విషయాలను తెలియజేశారు.అయితే హైదరాబాదులో నెల్లూరు పెద్దారెడ్డి చాపల పులుసు పేరుతో కూకట్ పల్లి, అమీర్ పేట్ పలుచోట్ల బ్రాంచ్ లను కిర్రాక్ ఆర్పి మొదలుపెట్టారు. అయితే వ్యాపారం ప్రారంభించిన మొదటి నుండే అనుహ్యమైన స్పందన రావడంతో నెల్లూరు పెద్దారెడ్డి చాపల పులుసు పేరు హైదరాబాదులో సంచలనంగా మారింది. ఇలా ఫేమస్ అవుతున్న క్రమంలోనే పెద్దారెడ్డి చాపల పులుసు గురించి పలు రకాల ఆరోపణలు కూడా వచ్చాయి . ఈ క్రమంలోనే నెల్లూరు పెద్దారెడ్డి చాపల పులుసు ధరలు ఎక్కువగా ఉంటాయని మాట బాగా వినిపించింది. ఇక ఇదే విషయాన్ని ఇంటర్వ్యూ చేసే యాంకర్ ఆర్పిని అడగగా ఆర్పి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా కిర్రాక్ ఆర్పి మాట్లాడుతూ తన వ్యాపారం తన ధరలు ఇలాగే ఉంటాయని మిగతా వాటికి మన కర్రీకి చాలా తేడా ఉంటుందని తెలియజేశారు.
నా చాపల కర్రీని కూడా కొనగలిగిన వారు మాత్రమే తీసుకుంటారని చెప్పుకొచ్చాడు. అలాగే మా బ్రాంచ్ లో చాపల పులుసు మీకు అందుబాటు ధరలో ఉంటేనే తీసుకోండి అని లేకపోతే వద్దని తెలియజేసాడు. అయితే చాలామంది కావాలనే తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మీరే స్వయంగా వచ్చి బ్రాంచ్ ను చూసి మీకు నచ్చితేనే తీసుకు వెళ్ళండి అంటూ ఈ సందర్భంగా ఆర్పి తెలియజేశారు. అయితే ఇక్కడ ఒకడు ఎదుగుతున్నాడు అంటే నలుగురు కిందకు లాగే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇక ఇది మన సమాజంలో ఎప్పటినుండో మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడు ఆర్పిని కూడా అదేవిధంగా లాగే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా ఆయన తెలియజేశారు. మరి ఆర్పి కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.