Rajinikanth : రజనీకాంత్ సినిమాలో లలితా జ్యువెల్లర్ ఓనర్.. నమ్మశక్యం కావడం లేదా..?
Rajinikanth : లలిత జువెల్లరీ స్టోర్స్ యాజమానికి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంట.. బిజినెస్‌ను ఎలా ప్రమోట్ చేసుకోవాలో ఈయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదనడంలో అతిశయోక్తి లేదు.సాధారణంగా బిజినెస్ చేసే ప్రతిఒక్కరూ తమ బ్రాండ్స్ మార్కెటింగ్ కోసం స్టార్ యాక్టర్స్‌ను పెట్టుకుని ప్రమోట్ చేయించుకుంటారు. కానీ లలితా జువెల్లరీ షాప్ ఓనర్ మాత్రం తన బ్రాండ్‌ను తానే ప్రమోట్ చేసుకోవడంతో చాలా ఫేమస్ అయ్యారు. బిజినెస్ కూడా చాలా డెవలప్ అయ్యింది.
Rajinikanth : డబ్బులు ఎవరికీ ఊరికే రావు..
బంగారు అభరణాలు అమ్మడంలో లలిత జువెల్లరీ స్టోర్స్ యాజమానికి ఒక ప్రత్యేక శైలి ఉంటుంది. డబ్బులు ఎవరికి ఊరికే రావు అనే ఒక్క డైలాగ్ తో అందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా ఈయన చెప్పే డైలాగ్స్ జ్యువెలరీ సంస్థకు ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈయన తన కంపెనీకి తానే బ్రాండ్ అంబాసిడర్‌గా మారి అందరినీ ఆశ్చర్యపరిచాడు .తెలుగులో ఎన్నో టీవీ యాడ్స్ వస్తుంటాయి. కానీ కిరణ్ కుమార్ యాడ్‌కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంటుంది.
ముఖ్యంగా కిరణ్ కుమార్ ప్రచారంలో గుండుతో కనిపించడం, ఇక ఆయన బంగారం కొనాలని చెప్పే విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. డబ్బులు ఊరికే రావు, ముందుగా ధర చెక్ చేయండి, నచ్చితేనే కొనండి అని చెప్పడంలో నిజాయితీ కనిపించింది. దాంతో లలిత జువెలరీస్ కి గిరాకీ కూడా బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కూడా పలుచోట్ల వీళ్ళు బ్రాంచీలను కూడా ఏర్పాటు చేశారు.
ఇక కిరణ్ కుమార్ గతంలో ఒక సినిమాలో కూడా నటించారని ఎవరికీ తెలీదు. రజనీకాంత్ హీరోగా అనుష్క శెట్టి, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటించిన లింగ సినిమాలో జువెల్లరీ యజమానిగా నటించి కిరణ్ కుమార్ ఆకట్టుకున్నారు. ఇక ఆయన గుండె ఆయనకు అదృష్టం అని.. గుండు అని పిలిచినా తాను బాధపడును అని కిరణ్ కుమార్ చెబుతూ ఉంటారు. ఇకపోతే మొదటిసారి కిరణ్ కుమార్ లింగా సినిమా కోసం కెమెరాను ఫేస్ చేశారు.ఆ తర్వాత తొలి యాడ్ కోసం మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. ఇకపోతే ఫస్ట్ యాడ్ చేయడానికి మూడు రోజులు పట్టిందని ఆయన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.