Laya : చీర‌క‌ట్టులో రెట్టింపు అయిన ల‌య అందం.. మ‌త్తెక్కిస్తుందిగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Laya : చీర‌క‌ట్టులో రెట్టింపు అయిన ల‌య అందం.. మ‌త్తెక్కిస్తుందిగా..!

 Authored By sandeep | The Telugu News | Updated on :23 May 2022,6:30 pm

Laya : సీనియ‌ర్ హీరోయిన్ ల‌య గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తెలుగులో 1999వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు కె. విజయ భాస్కర్ మరియు తెలుగు ప్రముఖ హీరో తొట్టెంపూడి వేణు కాంబినేషన్ లో తెరకెక్కిన స్వయంవరం అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయింది బ్యూటిఫుల్ హీరోయిన్ లయ. వచ్చి రావడంతోనే తన ప్రతిభను నిరూపించుకోవడంతో వరుసగా జగపతి బాబు, నందమూరి బాలకృష్ణ, శివాజీ, జె .డి చక్రవర్తి, తదితర స్టార్ హీరోలతో నటించే అవకాశాలు దక్కించుకుని అతికొద్ది సమయంలోనే స్టార్ డమ్ ని దక్కించుకుంది.

ఈ క్రమంలో దాదాపుగా 30 కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించి బాగానే ఆకట్టుకుంది.అయితే 2006 వ సంవత్సరంలో అమెరికాలో సెటిల్ అయినటువంటి ప్రముఖ వ్యాపారవేత్త ఉద్యోగి గణేష్ గోర్తి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.ఆ తర్వాత పలు అడపాదడపా చిత్రాలలో హీరోయిన్ గా నటించినప్పటికీ ఆకట్టుకోలేకపోయింది. చివ‌రిగా అమ‌ర్ అక్భ‌ర్ ఆంటోని అనే సినిమాలో ముఖ్య పాత్ర‌లో క‌నిపించి అల‌రించింది. కానీ ఆ సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది.

laya saree looks are stunning

laya saree looks are stunning

Laya : ల‌య అందాల ఆర‌బోత‌..

అందుకే చాలామంది ప్రేక్షకులకు లయ రీఎంట్రీ గురించి కూడా తెలీదు.ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న లయ.. వైరల్ అయిన కచ్చా బాదం పాటకు స్టెప్పులేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. పదేహేనేళ్ల క్రితం లయ ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉందంటూ ప్రశంసలు కురిపించారు. ఈ పాట‌నే కాదు చాలా పాట‌ల‌కి ఆడిపాడింది ల‌య‌. తాజాగా ఈ ముద్దుగుమ్మ చీర‌క‌ట్టులో అందాలు ఆర‌బోస్తూ మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది. ల‌య క్యూట్ నెస్ చూసి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డి పిక్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది