LB Sriram : చిరంజీవి సినిమాకి డైలాగ్స్ రాయడమే నాకు శాపం : ఎల్ బి శ్రీరామ్
LB Sriram : మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi సినిమాకి పనిచేయాలని సౌత్ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు నార్త్ లోనూ చాలామంది స్టార్స్, టెక్నీషియన్స్ ఆరాటపడుతుంటారు. తెలుగులో మెగా ఫ్యామిలీ హీరోలు మాత్రమే కాదు మిగతా చిన్న నుంచి స్టార్ హీరోలు ఆయనతో కొన్ని క్షణాలు స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎంతగా తాపత్రయపడుతుంటారు. కెరీర్ లో ఒక్కసారైనా చిరంజీవి సినిమాకి పని చేయాలని దర్శక, రచయితలు, ఒక్క సినిమానైనా నిర్మించాలని బడా నిర్మాతలు, ఆయనతో కలిసి ఒక్క స్టెప్పైనా వేయాలని గ్లామర్ హీరయిన్స్ ఎంత ఉబలాటపడుతుంటారో ఇప్పటికే ఎన్నో సందర్భాలలో చాలామంది వెల్లడించారు.

lb sriram comments on chiranjeevi
కానీ ఓ ప్రముఖ నటుడు, రచయిత మాత్రం చిరంజీవి గారి సినిమాకి పనిచేయడం నాకో పెద్ద శాపం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరెవరో కాదు ఎల్.బి.శ్రీరామ్ LB Sriram . ఈవీవీ సత్యనారాయణ లాంటి అగ్ర దర్శకుల వద్ద సినిమాలకి పనిచేయడంతో పాటు డైలాగ్స్ రాశారు ఎల్.బి.శ్రీరామ్ LB Sriram . ఆయనకి నటుడిగానూ క్రేజ్ తీసుకు వచ్చిన దర్శకులు ఈవీవీ సత్యనారాయణ. ఇక రచయితగా సెన్షేషనల్ హిట్ గా నిలిచిన నాగార్జున, సౌందర్యల హలో బ్రదర్, రాజేంద్ర ప్రసాద్ కి హిట్స్ ఇచ్చిన అప్పుల అప్పారావు, ఏప్రిల్ 1 విడుదల లాంటి సినిమాలకి డైలాగ్స్ రాసి బాగా పాపులర్ అయ్యారు.
LB Sriram : హిట్లర్‌కి డైలాగ్స్ రాసే అవకాశం అందుకున్నారు.
ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ సినిమా హిట్లర్‌కి డైలాగ్స్ రాసే అవకాశం అందుకున్నారు. ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. రంభ మెగాస్టార్ సరసన నటించింది. రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా ద్వారా నేటి ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ డాన్స్ మాస్టర్‌గా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.

lb sriram comments on chiranjeevi
ఇదే సినిమాకి డైలాగ్స్ రాసిన ఎల్.బి.శ్రీరామ్ బాగా పేరు తెచ్చుకున్నారు. ఆయన రాసిన సింపుల్ డైలాగ్స్ మెగాస్టార్ లో కొత్త మేనరిజాన్ని తీసుకువచ్చాయి. అయితే హిట్లర్ సినిమాకి పనిచేశాక స్టార్ రైటర్ అయ్యారని ఇండస్ట్రీలో చాలామంది ఆయనకి అవకాశాలివ్వడానికి సందేహించారు. చిన్న సినిమాలు తీసేవారు ఎల్.బి.శ్రీరామ్ LB Sriram దగ్గరికి రాలేకపోయారు. దాంతో రచయితగా ఆయన కెరీర్ దెబ్బతినిందని ఆయనే స్వయంగా చెప్పారు.
ఇది కూడా చదవండి ==> దాసరిగారు బ్రతికి ఉన్నప్పుడు చేయాలనుకుంది ఒకటి చేయలేకపోయారు.. అదేంటో తెలుసా..!
ఇది కూడా చదవండి ==> అది చూసిన సురేఖ..తనతో పెళ్ళికి ఒప్పుకోరనుకున్న చిరంజీవి..ఇంతకీ ఆమె చూసిందేంటి..?
ఇది కూడా చదవండి ==> మెగాస్టార్ చిరంజీవి తండ్రి కూడా నటుడే .. ఆయన నటించిన సినిమాలేంటో తెలుసా..?
ఇది కూడా చదవండి ==> సౌందర్య ఎవరిని పెళ్ళి చేసుకుందో తెలుసా.. తన మృతి తర్వాత భర్త పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే..?