Dasari narayana rao : దాసరిగారు బ్రతికి ఉన్నప్పుడు చేయాలనుకుంది ఒకటి చేయలేకపోయారు.. అదేంటో తెలుసా..!
Dasari narayana rao : తెలుగు, తమిళ, హిందీ, కన్నడ ..ఇలా భాష ఏదైనా చిత్రంలో స్టార్ డైరెక్టర్ గానీ, హీరోలు గానీ, నిర్మాతలు గాని తమ వారసత్వాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని తాపత్రయపడుతుంటారు. ఒకరకంగా చెప్పాలంటే ఇప్పుడున్న సెలబ్రిటీస్ లో సగానికి పైగా ఉంది వారసత్వమే. సీనియర్ స్టార్ దర్శకులు, నిర్మాతలు, హీరోలు తమ పిల్లలని హీరోలుగానో, హీరోయిన్ గానో పరిచయమయి స్టార్ స్టేటస్ సంపాదించుకుంటే అది చూసి ఆనందించాలని కలలుకంటారు. అయితే కొందరి విషయంలో అది సాధ్యపడదు. ఎంత స్టార్ కిడ్స్ అయిన అడ్రస్ వెతుక్కోవాల్సి వస్తుంది.
అటువంటి వాళ్ళలో దేశవ్యాప్తంగా గొప్ప పేరు సాధించిన దర్శకరత్న దాసరి నారాయణరావు కొడుకు దాసరి అరుణ్ కుమార్ కూడా ఇప్పుడు ఎక్కడున్నాడని వెతుక్కోవాల్సిన పరిస్థితి. సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది దర్శకులను, హీరోలను తీసుకు వచ్చి వారికి లైఫ్ ఇచ్చారు దాసరి గారు. స్టార్ డైరెక్టర్ అయిన కోడి రామకృష్ణ, రేలంగి నరసింహా రావు లాంటి వారు దాసరి శిష్యులే. వీరు ఇండస్ట్రీలో అగ్ర దర్శకులుగా కొన్నేళ్ళు ఓ వెలుగు వెలిగారు. అలాగే మంచు మోహన్ బాబుని ఈ స్థాయికి తీసుకు వచ్చిన దర్శకులు దాసరి గారే.
Dasari narayana rao : ఆయన బ్రతికి ఉన్నప్పుడు కొడుకు గురించే దిగులుగా ఉండేది.
ఇంతమందికి స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన దాసరి గారు..తన కొడుకుని స్టార్ ను చేయలేకపోయారు. ఇండస్ట్రీకి అయితే హీరోగా పరిచయం చేశారు గానీ, స్టార్ హీరోగా నిలబెట్టలేకపోయారు. అతడు సినిమాలు చేసిన పెద్ద హీరో కాదుకదా కనీసం మంచి క్యారెక్టర్ ఆర్ట్సిట్ గా కూడా సెటిలవలేకపోయారు. ఏవో కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఆయనకి పేరు తెచ్చినవి ఏవీ లేవు. సినీ, రాజకీయ నాయకుడిగా ఎంతో మంది సక్సెస్ ను ఎన్నో అవార్డులను అందుకున్న దాసరి మాత్రం కొడుకు సక్సెస్ చూడలేకపోయారు. ఆయన బ్రతికి ఉన్నప్పుడు కొడుకు గురించే దిగులుగా ఉండేది.
Dasari narayana rao : ఇది దాసరి నారాయాణ రావుగారికి ఒక కల
ఇది దాసరి నారాయాణ రావుగారికి ఒక కలగా, తీరని కోరికగా ఉండిపోయింది. తన సన్నిహితులయిన మోహన్ బాబు లాంటి వారి దగ్గర ఎన్నోసార్లు దాసరి గారు ఈ విషయం చర్చించి బాధపడ్డారు. ఎంతోమందికి లైఫ్ ఇచ్చాను. కానీ ఇండస్ట్రీలో నా కొడుకుని మాత్రం హీరోగా నిలబెట్టలేకపోయానని ఫీలయ్యేవారట. ఎప్పటికైనా కొడుకును పెద్ద హీరోగా చూడాలనేదే నా కోరిక అనేవారు. ప్రస్తుతం దాసరి అరుణ్ కుమార్ ఏవో వ్యాపారాలు చేసుకుంటున్నట్టు ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి ==> మెగాస్టార్ చిరంజీవి తండ్రి కూడా నటుడే .. ఆయన నటించిన సినిమాలేంటో తెలుసా..?
ఇది కూడా చదవండి ==> సౌందర్య ఎవరిని పెళ్ళి చేసుకుందో తెలుసా.. తన మృతి తర్వాత భర్త పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే..?
ఇది కూడా చదవండి ==> ఆర్ నారాయణమూర్తి ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో బయటపెట్టిన గద్దర్
ఇది కూడా చదవండి ==> సౌందర్య, సాయి కుమార్ డబ్బంతా కొట్టేశారు.. తిండి కూడా లేక అల్లాడిపోయారు..!