Bheemla Nayak Movie : పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..‘భీమ్లానాయక్’ రిలీజ్ డేట్‌పై మేకర్స్ క్లారిటీ..
Bheemla Nayak Movie : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఫిల్మ్ ‘భీమ్లానాయక్’. నిజానికి ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కావాల్సింది. కానీ, తెలుగు చిత్రాలు అయిన ‘ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్’ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో వాటి కోసం ‘భీమ్లా నాయక్’ రిలీజ్ వాయిదా వేశారు. ప్రొడ్యూసర్స్ గిల్డ్ రిక్వెస్ట్ మేరకు సినిమా విడుదల వాయిదా వేశారు.సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న నేపథ్యంలో ఫిబ్రవరి 25న విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. అయితే, కొవిడ్ పరిస్థితులు ఇతర చిత్రాల విడుదల తేదీలలో కూడా మార్పులు రావడంతో
ఆ టైంకు అయినా విడుదల అవుతుందా లేదా అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే పవన్ అశేష అభిమానులు వీ వాంట్ భీమ్లా నాయక్ అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా ట్రెండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మూవీ మేకర్స్ రిలీజ్ డేట్ పై మరోసారి క్లారిటీనిచ్చారు.‘భీమ్లా నాయక్’ పిక్చర్ ను అనుకున్న ప్రకారంగా ఫిబ్రవరి 25న విడుదల చేయడానికే తాము ప్రయత్నిస్తున్నామని, అయితే, ఆ తేదీన లేదా ఏప్రిల్ 1న విడుదల చేయడానికి సిద్ధమవుతున్నామని తెలిపారు. కొవిడ్ పరిస్థితులు ఇంప్రూవ్ అయిన క్రమంలో చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు.

makers given claity on bheemla nayak film release date
Bheemla Nayak Movie : థియేటర్స్‌లో ఇక పండుగే..
ఈ మేరకు సితార ఎంటర్ టైన్మెంట్స్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్టర్ రిలీజ్ చేశారు. ఇకపోతే ఏప్రిల్ 1న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’, సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ విడుదల కానున్నాయి. ఒకవేళ ‘భీమ్లా నాయక్’ కూడా అదే రోజు రిలీజ్ అయితే అభిమానులకు ఇక పండుగే అని చెప్పొచ్చు. ఈ చిత్రానికి సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు , స్క్రీన్ ప్లే అందించారు. ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందించారు.