Manchu Lakshmi : ఇన్నేళ్ల తరవాత బయటపడిన ఇంటరెస్టింగ్ సీక్రెట్.. మంచు లక్ష్మి మొదటి భర్త తో ఎందుకు విడిపోయింది అంటే ..!
Manchu Lakshmi : మంచు లక్ష్మి ప్రసన్న గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తన తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తెలుగులో సిద్ధార్థ్, శృతిహాసన్ జంటగా నటించిన ‘ అనగనగా ఓ ధీరుడు ‘ సినిమాలో విలన్ పాత్రలో నటించి మెప్పించింది లక్ష్మీ ప్రసన్న. తొలి సినిమాతోనే తన నటన ఏంటో నిరూపించింది. ఆ తర్వాత నిర్మాతగా గుండెల్లో గోదారి సినిమా చేసి మంచి సక్సెస్ ను అందుకుంది. బాలయ్య గెస్ట్ రోల్ చేసిన ఊ కొడతారా ఉలిక్కి పడతారా అనే సినిమాలో నటించింది. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు ఇక లక్ష్మి ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ ఉంటుంది.
పేద విద్యార్థులకు తమ విద్యాసంస్థలలో ఫ్రీగా చదువు ఇప్పించడం లాంటివి ఎన్నో చేస్తూ ఉంటుంది కానీ ఎక్కడ బయటికి చెప్పుకోరు. అయితే లక్ష్మి వ్యక్తిగత జీవితంలో ఎవరికి తెలియని కొన్ని నిజాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె ఆండీ శ్రీనివాస్ తో ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. అయితే లక్ష్మికి ఇంతకుముందే పెళ్లయిందని టాక్. ఈ విషయం ఇంతవరకు ఎవరికి తెలియదు. అయితే తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో మంచు లక్ష్మి మొదటి భర్త గురించి చేసిన కామెంట్లతో ఈ విషయం బయటకు వచ్చింది.
లక్ష్మి హైదరాబాదులో చదువుకున్న రోజుల్లో తన ఫ్రెండ్ లండన్ శ్రీనివాసుని ప్రేమించి సీక్రెట్ గా పెళ్లి చేసుకుందని అంటారు. అయితే ఈ పెళ్లి మోహన్ బాబుకు ఇష్టం లేకపోవడంతో ఇద్దరిని బలవంతంగా విడదీసి థియేటర్ ఆఫ్ కోర్స్ నేర్చుకునేందుకు లక్ష్మిని అమెరికాకు పంపించారట. అక్కడే ఆమెకు ఎన్నారై ఆండీ శ్రీనివాస్ తో పరిచయం ఏర్పడి పెళ్లి వరకు వచ్చింది. మోహన్ బాబుకు ఇష్టంతోనే వీరి పెళ్లి జరిగింది. కొద్దిరోజుల్లోనే భర్తతో విభేదాలు రావడంతో లక్ష్మి ఇండియాకు తిరిగి వచ్చేసిందట. ఆ తర్వాత ఆమె సరోగసి ద్వారా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దాంతో మళ్లీ వారిద్దరి మధ్య దాంపత్య బలం ఏర్పడిందట.