Mohan Babu : మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్న మోహన్ బాబు !
Mohan Babu : ఒకప్పుడు తన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న నటుడు మోహన్ బాబు. ఈయన హీరోగానే కాకుండా విలన్‌గాను నటించి మెప్పించారు. నిర్మాతగా కూడా మోహన్ బాబు రాణించారు. అయితే ఇటీవల కాలంలో ఆయన సినిమాలు ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోతున్నాయి. సినిమాలు వరుసగా పరాజయం చెందుతున్నాయి. ఆ మధ్య మోహన్‌బాబు `సన్నాఫ్ ఇండియా` చిత్రంతో వచ్చారు. ఓటీటీ కోసం చేసిన ఈ చిత్రాన్ని థియేటర్లో రిలీజ్ చేసి విమర్శలందుకున్నారు. దారుణమైన ట్రోల్స్ కి గురయ్యారు మోహన్‌బాబు. కనీసం ఆ విమర్శలకు సమాధానం ఇచ్చుకునే పరిస్తితి కూడా లేకుండా పోయింది.
ఇక ఇప్పుడు మెయిన్ లీడ్‌లో మరో సినిమా చేయబోతున్నట్టు ప్రచారం నడుస్తుంది.2019వ సంవత్సరంలో మలయాళంలో ఆండ్రాయిడ్ కుంజప్పన్ పాయింట్ టు ఫైవ్ అనే సినిమా విడుదలయి సూపర్ హిట్ గా నిలిచింది. రతీష్ బాలకృష్ణన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సూరజ్ వెంజరమూడు కీలక పాత్రలో అయితే నటించారు. ఇందులో సౌబిన్ షాహిర్, సూరజ్ తేలక్కడ్ కీలకపాత్రలలో నటించారు. ఇక ఈ సినిమాను ఆండ్రాయిడ్ కట్టప్ప పేరుతో తెలుగులో డబ్బింగ్ అయ్యింది. ఇండియా నుంచి జపాన్ వెళ్లి అక్కడ ఒక రోబోటిక్ కంపెనీలో పనిచేస్తూ ఉండే కొడుకు తన తండ్రి ఆలనా పాలన చూసుకోవడం కోసం తన కంపెనీ తయారు చేసిన రోబోట్ ని భారతదేశం పంపిస్తాడట..
Mohan Babu : చూద్దాం.. ఏం జరుగుతుందో..
అయితే ముందు దానికి దూరంగానే ఉన్నా కొడుకు దూరమై, నా అనే వాళ్ళు ఎవరూ లేని పరిస్థితుల్లో ఆ రోబోట్ కి దగ్గరవుతాడు సదరు వృద్ధుడు. ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ మూవీ మలయాళం వారినే కాదు తెలుగు ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను మంచు విష్ణు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వచ్చేఏడాది జనవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని మంచు విష్ణు వెల్లడించారు. ఈ సినిమాలో వృద్ధ పాత్రలో తన తండ్రి మోహన్ బాబు నటిస్తారని పేర్కొన్న ఆయన కొడుకు పాత్రలో ఎవరు నటిస్తారనే విషయం మీద మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే గాడ్ ఫాదర్ లాంటి సినిమానే ఇక్కడ పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోతుంది. మరి మోహన్ బాబు రీమేక్ చేసి చేతులు కాల్చుకుంటాడా లేదా అనేది భవిష్యత్‌లో తెలుస్తుంది.