MP Vijayasai Reddy : బాలకృష్ణ వలనే తారకరత్న ఇంకా బ్రతికి ఉన్నాడన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి..!!
MP Vijayasai Reddy : కుప్పంలో నారా లోకేశ్ పాదయాత్ర ప్రారంభం సమయంలో నందమూరి తారకరత్న గుండెపోటుతో కుప్పకూలిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. జనవరి 27న సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్నను వెంటనే కుప్పంలోని హాస్పిటల్‌కు తీసుకెళ్లగా, అక్కడ నుండి మెరుగైన వైద్య చికిత్స కోసం బెంగళూరుకు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. తారకరత్నను చూసేందుకు ఇప్పటికే చంద్రబాబు నాయుడు, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, బ్రాహ్మణి తదితరులు ఆసుపత్రికి వెళ్లారు. బాలయ్యపై ప్రశంసలు రీసెంట్‌గా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా
తారకరత్నని పరామర్శించి అనంతరం మీడియాతో మాట్లాడారు. డాక్టర్లు చాలా అద్బుతంగా చికిత్సనందిస్తున్నారు. తారకరత్నకు గుండె పోటు వచ్చిన రోజు 45 నిమిషాలు గుండె ఆగిపోవడం వల్ల మెదడుకు రక్తప్రసరణ నిలిచిపోవడంతో మెదడుపై భాగం దెబ్బతిన్నది. ఇక రక్తప్రసరణ నిలిచిపోవడం వల్ల కొంత వాపు ఏర్పడింది. ఈ నేపథ్యంలో మెదడు పనితీరు కూడా కొద్దిగా తగ్గింది. ప్రస్తుతం తారకరత్న గుండె పనితీరు మెరుగ్గానే ఉంది.అలానే రక్తప్రసరణ బాగుంది. లివర్‌తోపాటు కొన్ని మిగిలిన అవయవాల పనితీరు కాస్త తగ్గింది. నందమూరి బాలకృష్ణ వైద్య సదుపాయానికి సంబంధించిన విషయాలను తానే దగ్గరుండి చూసుకుంటున్నారు. బాలకృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు
విజయసాయిరెడ్డి అన్నారు. తారకరత్న త్వరలోనే కోలుకుంటారని చెప్పిన విజయసాయి రెడ్డి… డాక్టర్లు చాలా మంచి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు.తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి విజయసాయి రెడ్డి భార్య సోదరి కూతురు అనే విషయం తెలిసిందే. అలేఖ్యా రెడ్డి టాలీవుడ్‌లో కొన్ని సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేశారు. తారకరత్నకు గుండె పోటు అని తెలిసిన దగ్గర్నుంచి నందమూరి బాలకృష్ణ ఆయన వెన్నంటే ఉండి అన్ని ఏర్పాట్లను చూస్తున్న విషయం తెలిసిందే. బెంగళూరుకు తరలించాక కూడా బాలయ్యే అక్కడే ఉంటూ వైద్యులతో నిత్యం చర్చలు జరుపుతున్నారు. తారకరత్న కోసం బాలయ్య పడుతున్న వేదన, ఆయన తపన నందమూరి అభిమానులను ఎంతగానో కదిలించింది.