Samantha : ఒకే లొకేషన్‌లో సమంత నాగ చైతన్య షూటింగ్..!
Samantha : తెలుగు సినిమా పరిశ్రమలో మోస్ట్ లవబుల్ కపుల్ అనగానే గుర్తొచ్చే జంట సమంత – నాగ చైతన్యది. కానీ అనివార్య కారణాల వల్ల వీరిద్దరూ విడిపోక తప్పలేదు. అయితే వీరి విడాకుల వార్త నుంచి వారి అభిమానులు ఇంకా కోలుకోవడం లేదు. అక్కినేని ఇంట్లో కోడలిగా అడుగుపెట్టిన సమంత నాలుగేళ్లు తిరగకముందే ఊహించని విధంగా ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. విడాకుల అనంతరం… వీరిద్దరూ దీనిపై ఎక్కడా అఫిషియల్ గా మాట్లాడలేదు. అయితే వీరిద్దరికీ సంబంధించిన ప్రతీ అంశం వైరల్ అవుతూ వచ్చింది. అయితే ఇదే కోవలో మరో అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
నాగ చైతన్య, సమంత వారి వారి తర్వాతి సినిమాల షూటింగ్ లకు ఒకే లొకేషన్ లో జరుపుకున్నారట.నాగ చైతన్య నటిస్తున్న బంగార్రాజు షూటింగ్, ఆయన మాజీ భార్య సమంత నటిస్తున్న యశోద మూవీ షూటింగ్… ఇవి రెండు రామా నాయుడు స్టూడియో లోనే ప్రస్తుతం షూట్ జరుపుకుంటున్నాయి. అదే స్టూడియోలో యశోద షూటింగ్ జరుగుతున్నట్లు ఇంతకు ముందే తెలియగా.. తాజాగా నేటితో బంగార్రాజు చిత్రానికి ప్యాకప్ చెప్పినట్లు తన ద్వారా వెల్లడించడంతో ఈ అంశం ఇప్పుడు చర్చకు దారి తీసింది.

Naga chaitanya and Samantha shooting in same location
Samantha : ఒకే లొకేషన్ లో చైతన్య సమంత..!
ఒకే లొకేషన్‌లో షూటింగ్ చేస్తున్న చైతూ- సామ్‌లు కలిశారా, మాట్లాడుకున్నారా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.వరుస చిత్రాలకు సైన్ చేస్తూ బిజీగా ఉన్న సమంత ఇటీవల అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో ఐటెం సాంగ్లో నటించి దుమ్ము దులిపేసింది. ప్రస్తుతం ఈమె యశోదతో పాటు ఓ హాలీవుడ్ మూవీ లో నటిస్తుంది. ఇక ఇటీవలే లవ్ స్టోరీ సినిమాతో హిట్ అందుకున్న చైతు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ మూవీతో పాటు బాలీవుడ్ లో అమీర్ ఖాన్ హీరోగా వస్తున్న ఓ మూవీ లో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నాడు.