Samantha : బెడ్ మీద పడి ఉన్న సమంత ని కలవకపోగా – రివర్స్ దెబ్బ కొట్టిన నాగ చైతన్య ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : బెడ్ మీద పడి ఉన్న సమంత ని కలవకపోగా – రివర్స్ దెబ్బ కొట్టిన నాగ చైతన్య ?

 Authored By ramesh | The Telugu News | Updated on :3 November 2022,9:35 pm

Samantha : నాగ చైతన్య, సమంత ఇద్దరు చక్కని జంటగా అక్కినేని ఫ్యాన్స్ ని అలరించారు. ఇద్దరు కలిసి కొన్నాళ్లు ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే పెళ్లి తర్వాత 3 ఏళ్లకే ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇద్దరి మధ్య గొడవల గురించి కూడా బయటకు రానివ్వకుండా డైవర్స్ తీసుకుంటున్నాం అన్న ఎనౌన్స్ మెంట్ తోనే అందరికి షాక్ ఇచ్చారు. చైతుతో దూరమైన తర్వాత సమంత చాలా డిప్రెషన్ లోకి వెళ్లింది. అయితే ఈమధ్యనే సమంతకి మయోసైటిస్ అనే వ్యాధి వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యాధికి ప్రస్తుతం ట్రీట్ మెంట్ జరుపుకుంటుంది సమంత.

ఓ పక్క బెడ్ మీద ఉన్న ఆమెని కలవడానికి నాగ చైతన్య వస్తాడేమో అని ఎదురుచూస్తుంటే అతను రాకపోగా ఆమె కెరియర్ ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతకా ఏమైంది అంటే.. సమంత చేద్దామని అనుకున్న ఓ మళయాళ సినిమాని ఆమెకి దక్కకుండా అన్నపూర్ణ బ్యానర్ తో ఆ సినిమా హక్కులు కొనేశారట. అది కూడా సమంత ఈ వ్యాధి వల్ల సఫర్ అవుతున్న టైం లోనే ఇలా చేశారట. నాగ చైతన్య ఇలా చేయడం అసలు ఊహించని సమంత అతని మీద తీవ్ర అసంతృప్తిగా ఉందని తెలుస్తుంది. కెరియర్ లో ఎన్ని దెబ్బలు తిన్నా మళ్లీ తన గ్రాఫ్ పెంచుకుంటూ వస్తున్న సమంత ప్రస్తుతం వ్యాధి నుంచి బయట పడటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.

naga chaitanya big news to samantha

naga chaitanya big news to samantha

హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ జరుపుకుంటున్న సమంత రోజు రోజుకి వ్యాధి తగ్గుముఖం పట్టేలా పరిస్థితి కనబడుతుందని అంటున్నారు. అయితే కెరియర్.. సినిమాలు ఇవన్ని ఒక రెండు నెలలు ఆలోచించకుండా కేవలం తన ఎల్త్ మీదే దృష్టి పెట్టాలని సమంతకు డాక్టర్లు చెప్పారట. అయితే సమంత మాత్రం ఆ మళయాళ సినిమా గురించి తెలుసుకుని బాధపడ్డదని తెలుస్తుంది. మరి నాగ చైతన్య ఇలా కావాలనే చేశాడా లేక అలా జరిగిందా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా సమంతకి ఈ టైం లో చఒతు కొట్టిన దెబ్బ మాములుగా లేదని అంటున్నారు.

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది