Naga Chaitanya : సమంత బాటలో నాగచైతన్య.. విడాకుల తర్వాత తొలిసారి అలా..!
Naga Chaitanya : టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్‌గా ఉన్న సమంత, నాగచైతన్య విడిపోయిన సంగతి అందరికీ విదితమే.ఇకపోతే ఆ నాటి నుంచి కొందరు సోషల్ మీడియా వేదికగా సమంతను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. కాగా, సమంత సైతం ట్రోల్స్‌కు దిమ్మ దిరిగిపోయే కౌంటర్స్ ఇస్తోంది. ఈ సంగతులు అలా ఉంచితే.. విడాకుల తర్వాత నాగచైతన్య ఓ విషయంలో సమంత బాటలో వెళ్తున్నారు. నాగచైతన్య తొలి సారి అలా చేయబోతున్నాడు. అదేంటో తెలుసుకుందాం.నాగచైతన్యకు సంబంధించిన ఈ వార్త ప్రజెంట్ సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. ఇంతకీ ఆ వార్త ఏమిటంటే..
సమంత మాదిరిగానే డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన సమంత.. ఆ సిరీస్‌తో మంచి పేరు సంపాదించుకుంది. కాగా, సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్న న్యూస్ ప్రకారం.. నాగచైతన్య విక్రమ్ .కె.కుమార్ డైరెక్షన్‌లో ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నారు. ఇందులో నాగచైతన్య తొలి సారి జర్నలిస్టు పాత్రను పోషిస్తారని తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్‌గా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోందట.ఇకపోతే సమంత నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ కూడా అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ కావడం గమనార్హం. సమంత గతంలో ‘మహానటి’ చిత్రంలో పాత్రికేయురాలి పాత్రను పోషించింది.

naga chaitanya going in the way samantha true
Naga Chaitanya : నాగచైతన్య డేరింగ్ స్టెప్..
సమంత సినిమాల విషయానికొస్తే ప్రజెంట్ ఆమె ‘యశోద’ అనే పాన్ ఇండియా మూవీలో లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ఈ చిత్ర షూటింగ్‌లో త్వరలో ఆమె పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఇక తాజాగా సమంత చేసిన స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా మావా.. ’ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’లో సమంత ఐటెం సాంగ్‌లో కనిపించి సినిమాలో హైలైట్‌గా నిలిచింది. ఈ పిక్చర్‌లో బన్నీకి జోడీగా క్యూట్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక మందన నటించింది.