Naga Chaitanya : అక్కినేని ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఫొటోతో క్లారిటీ ఇచ్చిన నాగచైతన్య..
Naga Chaitanya : నాగచైతన్య.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. జోష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ యువ హీరో.. మొదట్లో మంచి హిట్స్ అందుకున్నా.. తర్వాత పలు మూవీలు నిరాశ పరిచాయి. దీంతో ఆయన కెరీర్ అయిపోయిందని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ మజిలి మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అనంతరం విక్టరీ వెంకటేశ్ తో కలిసి వెంకీమామ మూవీ చేశాడు. ఆ మూవీ సైతం హిట్ సాధించింది. ఇక అదే ఊపును కంటిన్యూ చేయాలని అనుకున్నాడు.

Naga Chaitanya photo shared thankyou movie unit
గతేడాది శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన లవ్ స్టోరీ మూవీలో నాగచైతన్య హీరోగా యాక్ట్ చేశాడు. ఈ మూవీ సైతం హిట్ కొట్టడంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు నాగచైతన్య. దీనితో పాటు సంక్రాంతికి రిలీజ్ అయిన బంగర్రాజు మూవీతో తన తండ్రి నాగార్జునతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఈ మూవీ సైతం మంచి టాక్ సొంతం చేసుకుంది. దీంతో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు నాగచైతన్య. ప్రస్తుతం విజయ్ కే కుమార్ డైరెక్షన్ లో థ్యాంక్యూ అనే మూవీ చేస్తున్నాడు. వీరి కాంబినేషన్ లో ఇప్పటికే మనం వంటి సూపర్ హిట్ మూవీ వచ్చింది.

Naga Chaitanya photo shared thankyou movie unit
Naga Chaitanya : ఫొటో షేర్ చేసిన మూవీ యూనిట్
థ్యాంక్యూ మూవీతో వీరి కాంబినేషన్ రిపిట్ అవుతుండటంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి.శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ మూవీ టాకీ పార్ట్ పూర్తయింది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ సైతం ప్రకటించింది. ఇక తాజాగా మూవీ యూనిట్ తో కలిసి దిగిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అక్కినేని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే ఈ మూవీని ఓటీటీలో కాకుండా థియేటర్స్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించింది నిర్మాణ సంస్థ.