Kalyan Ram : ఎన్టీఆర్‌, కొరటాల మూవీ ఆగిపోయింది… అసలు విషయం చెప్పిన కళ్యాణ్‌ రామ్‌

Advertisement

Kalyan Ram : ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా లో కొమురం భీమ్ గా నటించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న హీరో ఎన్టీఆర్‌. విదేశాల్లో కూడా ఇప్పుడు ఎన్టీఆర్ కి ఫ్యాన్ ఫాలోయింగ్‌ పెరిగింది. అంతే కాకుండా ఆయన ఒక అద్భుతమైన నటుడు అంటూ ప్రతి ఒక్కరు కూడా కితాబిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ తదుపరి సినిమా ను ఎంత స్పీడ్ గా చేయాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రేజ్‌ ను వినియోగించుకునేందుకు వెంటనే సినిమా చేస్తే బాగుంటుంది. కాని ఎన్టీఆర్‌ సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది.

Advertisement

ఎన్టీఆర్ ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టాల్సి ఉంది. కాని ఇప్పటి వరకు కథ రెడీ అవ్వక పోవడం తో మొదలు పెట్టలేదు. దాంతో ఈ సినిమా క్యాన్సిల్‌ అయ్యిందేమో అంటూ పుకార్లు షికార్లు చేయడం మొదలు అయ్యింది. కొరటాల శివ సినిమా ను క్యాన్సిల్‌ చేసుకున్న ఎన్టీఆర్‌ త్వరలోనే బుచ్చిబాబు సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినా ఆశ్చర్యం లేదు అంటూ గుసగుసలు వినిపించాయి. ఎన్టీఆర్‌ 30 సినిమా దర్శకుడు మారాడు అంటూ వస్తున్న వార్తలపై కళ్యాణ్ రామ్‌ స్పందించాడు.

Advertisement
nandamuri kalyan ram about Jr ntr 30 movie rumors
nandamuri kalyan ram about Jr ntr 30 movie rumors

ఎన్టీఆర్‌ 30 సినిమా కు ఒక నిర్మాతగా కళ్యాణ్‌ రామ్‌ వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. అందుకే ఆ సినిమా పై కళ్యాణ్ రామ్‌ స్పందించాడు. ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా తో ఒక భారీ సినిమా ను ఎన్టీఆర్‌ చేశాడు. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ సినిమా అంటే సహజంగా నే భారీ తనం ఉండాలని అంతా కోరుకుంటారు. అందుకే ఈ సినిమా ను కాస్త ఆలస్యం అయినా కూడా ప్రతి ఒక్కరి అంచనాలను అందుకునేలా తీసుకు వస్తాం. అంతే తప్ప ఈ సినిమా క్యాన్సిల్‌ అవ్వలేదని కళ్యాణ్ రామ్‌ క్లారిటీ ఇచ్చాడు. ఎన్టీఆర్‌ కొరటాల కాంబో సినిమా ఏ క్షణంలో అయినా మొదలు అయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నాడు.

Advertisement
Advertisement