Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌజ్‌లో పుట్టుకొస్తున్న కొత్త ప్రేమాయ‌ణాలు.. కంటెంట్ మాములుగా ఇవ్వ‌డం లేదుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌజ్‌లో పుట్టుకొస్తున్న కొత్త ప్రేమాయ‌ణాలు.. కంటెంట్ మాములుగా ఇవ్వ‌డం లేదుగా..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. కంటెస్టెంట్స్ చేసే ర‌చ్చ‌కి అంద‌రు షాక్ అవుతున్నారు. కొన్ని జంట‌లు అప్పుడే ప్రేమాయ‌ణాలు మొద‌లు పెట్ట‌డంతో కావ‌ల్సినంత స్ట‌ఫ్ దొరుకుతుంది. అయితే య‌ష్మిలో అవసరానికి మించిన‌ ఫైరింగ్‌ కనిపిస్తుంది. మణికంఠ విషయంలో ఆమె సంచలన కామెంట్‌ కూడా చేసింది. తాను ఉన్నంత వరకు మణికంఠని నామినేట్‌ చేస్తానని తెలిపింది. మరోసారి పృథ్వీరాజ్‌ ముందు కూడా అదే విషయం […]

 Authored By ramu | The Telugu News | Updated on :18 September 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌజ్‌లో పుట్టుకొస్తున్న కొత్త ప్రేమాయ‌ణాలు..కంటెంట్ మాములుగా ఇవ్వ‌డం లేదుగా..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. కంటెస్టెంట్స్ చేసే ర‌చ్చ‌కి అంద‌రు షాక్ అవుతున్నారు. కొన్ని జంట‌లు అప్పుడే ప్రేమాయ‌ణాలు మొద‌లు పెట్ట‌డంతో కావ‌ల్సినంత స్ట‌ఫ్ దొరుకుతుంది. అయితే య‌ష్మిలో అవసరానికి మించిన‌ ఫైరింగ్‌ కనిపిస్తుంది. మణికంఠ విషయంలో ఆమె సంచలన కామెంట్‌ కూడా చేసింది. తాను ఉన్నంత వరకు మణికంఠని నామినేట్‌ చేస్తానని తెలిపింది. మరోసారి పృథ్వీరాజ్‌ ముందు కూడా అదే విషయం చెప్పింది. అయితే నామినేషన్‌లో జరిగిన దానికి యష్మిని కూల్ చేసే ప్రయత్నం చేశాడు నాగమణికంఠ. ఆమెని ఓదార్చే ప్రయత్నం చేశాడు. నామినేషన్‌లో జరిగింది వదిలేయమని తెలిపారు. ఆమె ఓకే వదిలేయమని చెప్పింది. అయితే ఆయన యష్మిని రెండు మూడు సార్లు హగ్‌ చేసుకున్నాడు. ఈ విషయంలో యష్మి ఇబ్బంది పడినట్టుగా ఫీలయ్యింది.

Bigg Boss 8 Telugu ఏందయ్యా బిగ్ బాస్ ఇది…

అంతేకాదు బిగ్‌ బాస్‌ ముందు తన గోడు వెళ్లబోసుకుంది. తనని హగ్‌ చేసుకోవడం తన వల్ల కావడం లేదని, అతను అంతా ఫేక్‌గా ఉంటున్నాడని చెప్పింది. పైగా మణికంఠ అలా చేయడం ఇబ్బందిగా ఉందంటూ బిగ్‌ బాస్‌ ముందు కన్నీళ్లు పెట్టుకుంది. ఇదే విషయాన్ని పృథ్వీరాజ్‌ వద్ద వెల్లడించింది. హగ్‌ చేసుకోవడం తనకు కంఫర్ట్ గా లేదని చెప్పింది. అయితే తన కప్‌ కాఫీని మాత్రం పృథ్వీరాజ్‌తో పంచుకోవడం ఆశ్చర్యంగా మారింది. ఇద్దరు కలిసి ఒకే కప్‌లోని కాఫీ తాగడం విశేషం. హౌజ్‌లో లవ్‌ కి సంబంధించిన డిస్కషన్‌ జరిగింది. నిఖిల్‌, కిర్రాక్‌ సీతల మధ్య కాసేపు పులిహోర కలిపించాడు బిగ్‌ బాస్‌. ఆ తర్వాత విష్ణు ప్రియాని రంగంలోకి దించాడు. ఆమెతోనూ ఈ చర్చని నడిపించాడు. అనంతరం యష్మిని దీనిలోకి తీసుకొచ్చారు. సీత, విష్ణు ప్రియా పిలిపించి యష్మిని.. నిఖిల్‌ నిన్ను ఫ్లర్ట్ చేశాడా? అంటూ ప్రశ్నించారు.

Bigg Boss 8 Telugu బిగ్ బాస్ హౌజ్‌లో పుట్టుకొస్తున్న కొత్త ప్రేమాయ‌ణాలుకంటెంట్ మాములుగా ఇవ్వ‌డం లేదుగా

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌజ్‌లో పుట్టుకొస్తున్న కొత్త ప్రేమాయ‌ణాలు..కంటెంట్ మాములుగా ఇవ్వ‌డం లేదుగా..!

అలా ఏం లేదని చెప్పింది. అయితే కన్ను కొట్టాడని అడగ్గా అతను కొట్టాడని, తాను కొట్టాను అంటూషాకిచ్చింది యష్మి. దీంతో సీత, విష్ణు ప్రియా, నైనిక నవ్వుకున్నారు. ఇది అర్థం కాక కాసేపు హడావుడి చేసిన యష్మి వెళ్లిపోయింది. నాగమణికంఠతో డిస్కషన్‌ రాగానే వెళ్లిపోవడం ఆయనంటే ఎంతగా ఇరిటేట్‌ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. మ‌రోవైపు ల‌వ్ డిస్క‌ష‌న్ విష‌యంలో సోనియా పృథ్వీరాజ్‌ని ప్రశ్నించింది. నీకు యష్మి అంటే ఇష్టమని డిస్కషన్‌ జరుగుతుందని, మిగిలిన వాళ్లు అనుకుంటున్నారని చెప్పగా, ఆమె ఇష్టం, నువ్వు కూడా ఇష్టమని చెప్పడంతో సోనియా ఖుషి అయ్యింది. మరోవైపు నిఖిల్‌, యష్మిల మధ్య ట్రాక్‌ నడుస్తుందనే డ్రామా కూడా క్రియేట్‌ చేశారు. అలాగే యష్మి, పృథ్వీరాజ్‌ క్లోజ్‌గా మూవ్‌ కావడం కూడా చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి హౌజ్‌లో ల‌వ్ ట్రాక్ లు, టాస్క్‌ల‌తో ర‌చ్చ న‌డుస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది