Paranitha : సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ప్రణీత
Paranitha Subash బాపుగారి బొమ్మ అంటూ దుమ్ములేపిన హీరోయిన్ ప్రణీత Paranitha Subash ఇప్పుడు అందరికీ షాక్ ఇచ్చింది. సైలెంట్‌గా పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలే ఈ కరోనా కాలంలో ప్రణీత ఎంతగా సేవ చేస్తూ బిజీగా ఉంటోందో అందరికీ తెలిసిందే. అలాంటి ప్రణీత ఈ సెకండ్ వేవ్‌లో కాస్త సైలెంట్ అయ్యారు. అలా ఎందుకు సైలెంట్‌గా ఉన్నారో ఇప్పుడు అందరికీ అర్థమైంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండకపోవడానికి కూడా కారణం పెళ్లి అయి ఉంటుందని అందరూ అనుకుంటున్నారు.

Paranitha Subash married Nitin Raju
Paranitha Subash ఓ ప్రముఖ వ్యాపారవేత్త ప్రణీత వివాహం
హీరోయిన్ ప్రణీత Paranitha Subash వ్యాపారవేత్త అయిన నితిన్ రాజును వివాహామాడింది. నేడు బెంగళూరులో ఈ వేడుక జరిగింది. కరోనా నేపథ్యంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ పెళ్లి జరిపించారట. అతి తక్కువ మంది అతిథుల సమక్షంలో ఈ పెళ్లి జరిగినట్టు తెలుస్తోంది. అందుకే ఈ వివాహాం గురించి ప్రణీత ఎక్కడా కూడా ప్రకటన చేయలేదు. అలా సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. మొత్తానికి సడెన్‌గా ఫోటోలు బయటకు రావడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
గత ఏడాది ప్రణీత Paranitha Subash చేసిన సేవా కార్యక్రమాలు అందరికీ తెలిసిందే. ఉపాధి కోల్పోయి తిండి లేక తిప్పలు పడుతున్న వారికి ఆహారాన్ని అందించింది. ఎంతో మంది ఆకలిని తీర్చింది. అలా ప్రణీత చేసిన మంచి పనులతో సోషల్ మీడియాలో సరికొత్త ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఇలా ప్రణీత పెళ్లి చేసుకుందని తెలియడంతో నెటిజన్లందరూ కంగ్రాట్స్ అంటూ విషెస్ తెలుపుతున్నారు.