Kodi ramakrishna : కోడి రామకృష్ణ – బాలకృష్ణ కాంబినేషన్‌లో మొదలై ఆగిపోయిన సినిమా ఇదే

Advertisement

Kodi ramakrishna : శత చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ Kodi ramakrishna కి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన దర్శకత్వంలో వచ్చిన   సినిమాలలో 100కి పైగా సినిమాలు 100 రోజులు బాక్సాఫీస్ వద్ద భారీ   వసూళ్ళు రాబట్టినవే. అందుకే ఆయనని శత చిత్రాల దర్శకుడు Kodi ramakrishna   అంటారు. దర్శకరత్న దాసరి నారాయణ రావు వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన కోడి రామకృష్ణ Kodi ramakrishna దర్శకుడిగా మారుతూ మెగస్టార్ చిరంజీవి Chiranjeevi తో ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమా చేశారు. ఈ సినిమా 560 రోజులు ఆడింది. దాంతో క్రేజీ డైరెక్టర్ గా మారిన ఆయనతో పలువురు   స్టార్ హీరోలు సినిమా చేసేందుకు ఆసక్తి చూపించారు.

this is the movie in combo of kodi-ramakrishna-balakrishna
this is the movie in combo of kodi-ramakrishna-balakrishna

వీరిలో నందమూరి బాలకృష్ణ Balakrishna ఒకరు. భార్గవ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థ ఎక్కువగా కోడి రామకృష్ణ – బాలకృష్ణ Balakrishna కాంబినేషన్‌లో సినిమాలు నిర్మించి సూపర్ హిట్స్   అందుకుంది.   అయితే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఒక సినిమా   మాత్రం సగం చిత్రీకరణ పూర్తయ్యాక ఆగిపోయింది. 1984 లో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన   మొదటి సినిమా ‘మంగమ్మగారి మనవడు’. ఇందులో కీలక పాత్ర పోషించిన భానుమతి గారిని బాలయ్య Balakrishna బామ్మ పాత్రకి ఒప్పించడానికి దర్శకుడు కోడి రామకృష్ణ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆమె ఒప్పుకుంది కాబట్టే ఈ సినిమా సంచలన విజయం అందుకుంది.

Advertisement

Kodi ramakrishna : బాలయ్య – కోడి రామకృష్ణ కాంబినేషన్‌లో 8వ సినిమాగా ‘విక్రం సింహ భూపతి’

కాగా భార్గవ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ లో బాలయ్య – కోడి రామకృష్ణ కాంబినేషన్ లో ఏడు సినిమాలు వచ్చాయి. వాటిలో ఒక సినిమా తప్ప మిగతా సినిమాలన్నీ   బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. దాంతో సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అయిన   బాలయ్య – కోడి రామకృష్ణ కాంబినేషన్‌లో 8వ సినిమాగా ‘విక్రం సింహ భూపతి’ అనే సినిమా మొదలైంది. ఈ సినిమా షూటింగ్ సగం   పూర్తవగానే నిర్మాత అనూహ్యంగా మృతి చెందారు. దాంతో వీరిద్దరి కాంబినేషన్‌లో రిలీజ్ కాకుండా ఆగిపోయిన సినిమాగా ‘విక్రం సింహ భూపతి’ మిగిలింది. ఇక కెరీర్ ప్రారంభంలో   బాలకృష్ణకి హిట్స్ ఇచ్చి స్టార్ ఇమేజ్ తీసుకువచ్చిన  దర్శకుడు కోడి రామకృష్ణ కావడం విశేషం.

ఇది కూడా చ‌ద‌వండి ==> దాసరిగారు బ్రతికి ఉన్నప్పుడు చేయాలనుకుంది ఒక‌టి చేయలేకపోయారు.. అదేంటో తెలుసా..!

ఇది కూడా చ‌ద‌వండి ==> అది చూసిన సురేఖ..తనతో పెళ్ళికి ఒప్పుకోరనుకున్న చిరంజీవి..ఇంతకీ ఆమె చూసిందేంటి..?

ఇది కూడా చ‌ద‌వండి ==> మెగాస్టార్ చిరంజీవి తండ్రి కూడా నటుడే .. ఆయన నటించిన సినిమాలేంటో తెలుసా..?

ఇది కూడా చ‌ద‌వండి ==> సౌందర్య ఎవరిని పెళ్ళి చేసుకుందో తెలుసా.. తన మృతి తర్వాత భ‌ర్త ప‌రిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే..?

Advertisement
Advertisement