Bigg Boss Telugu 7 : ప్రిన్స్ యావర్ సేఫ్.. మిగితా వాళ్లకు షాక్.. ప్రియాంక, శోభా శెట్టి ఎలిమినేట్ చేసినా ప్రేక్షకులు సేవ్ చేశారు
Bigg Boss Telugu 7 : ప్రిన్స్ యావర్.. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. నిజానికి ఎలాంటి అంచనాలు లేకుండా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడు ప్రిన్స్ యావర్. ఏదో కొన్ని సీరియళ్లలో నటించిన అనుభవం, ఒక మోడల్ గా చేసిన అనుభవం తప్పితే యావర్ కు మరే అనుభవం లేదు. అంత ఫేమస్ ఫేస్ కూడా కాదు. అందుకే యావర్ మీద ఎవ్వరి దృష్టి […]
Bigg Boss Telugu 7 : ప్రిన్స్ యావర్.. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. నిజానికి ఎలాంటి అంచనాలు లేకుండా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడు ప్రిన్స్ యావర్. ఏదో కొన్ని సీరియళ్లలో నటించిన అనుభవం, ఒక మోడల్ గా చేసిన అనుభవం తప్పితే యావర్ కు మరే అనుభవం లేదు. అంత ఫేమస్ ఫేస్ కూడా కాదు. అందుకే యావర్ మీద ఎవ్వరి దృష్టి పెద్దగా పడలేదు. కానీ.. వారం వారం తనను తాను మెరుగుపరుచుకుంటూ యావర్ ముందుకెళ్తున్నాడు. ప్రేక్షకుల మనసు దోచుకుంటున్నాడు. తాజాగా యావర్ మూడో వారం ఎలిమినేషన్ నుంచి కూడా తప్పించుకున్నాడు.
అయితే.. మూడో పవరాస్త్ర కోసం జరిగిన పోటీలో యావర్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అన్న కారణంతో యావర్ ను శోభా శెట్టి, ప్రియాంక ఇద్దరూ కలిసి ఎలిమినేట్ చేశారు. వాళ్లిద్దరిలో శోభా శెట్టి మూడో పవరాస్త్ర పొంది.. మూడో ఇంటి సభ్యురాలిగా కన్ఫమ్ అవడమే కాదు.. మూడు వారాల ఇమ్యూనిటీ కూడా పొందింది. అంటే మరో మూడు వారాల వరకు తను సేఫ్ అన్నమాట. నిజానికి ఆ ప్లేస్ ప్రిన్స్ యావర్ కు దక్సాల్సింది. మనోడు గేమ్ చేంజర్ అని ఇంటి సభ్యులు కూడా తీర్పు చెప్పేశారు. అంటే.. ఏ టాస్క్ అయినా కూడా ప్రిన్స్ యావర్ గట్టిగా ఆడతూ తన సత్తా చాటుతున్నాడు.
Bigg Boss Telugu 7 : ఈసారి ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
ఇక.. మూడో వారంలో సేఫ్ అయిన తొలి కంటెస్టెంట్ గా యావర్ చరిత్ర సృష్టించాడు. నామినేషన్లలో ఉన్న వారిలో డేంజర్ జోన్ లో ఉన్నది అయితే దామిని. మరి ఈ వారం దామిని ఇంటి నుంచి వెళ్లిపోతుందా లేదా అనేది పక్కన పడితే.. ఈ వారం గేమ్ చేంజర్ గా యావర్ సెలెక్ట్ అయితే సేఫ్ గేమ్ ఆడుతున్న వాళ్లలో నెంబర్ వన్ గా తేజను సెలెక్ట్ చేశారు ఇంటి సభ్యులు.
మొత్తానికి శనివారం వీకెండ్ ఎపిసోడ్ బాగానే అలరించింది. ముఖ్యంగా అమర్ దీప్, సందీప్ ఇద్దరికీ బీభత్సమైన వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.