Rajamouli : రాజమౌళి వార్నింగ్ ఇవ్వడం కారణం గానే ఆస్కార్ వేదిక మీద చంద్రబోస్ మాట్లాడలేదు ?
Rajamouli : ఆస్కార్ అవార్డు అనేది ఓ కల. అలాంటిది మన తెలుగు సినిమాకి ఆస్కార్ రావడం గొప్ప విశేషం. దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమా ఆస్కార్ అవార్డును అందుకుంది. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో ఆస్కార్ అవార్డు లభించింది. ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంతో ఆర్ఆర్ఆర్ టీం మొత్తం ఆనందం వ్యక్తం చేసింది. అంతే కాదు మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి తనదైన స్టైల్ లో ఆస్కార్ వేడుకలో స్పీచ్ ఇచ్చారు. పాట రూపంలోనే ఆయన స్పీచ్ అందుకున్నాడు.
ఆస్కార్ అవార్డు అందుకున్న చంద్రబోస్ ఎక్కడ మాట్లాడలేదు. చివర్లో నమస్తే అని చెప్పారు. కానీ స్పీచ్ ఇవ్వలేదు. దీంతో చంద్రబోస్ ఆస్కార్ వేడుకలో ఎందుకు మాట్లాడలేదు అనే న్యూస్ వైరల్ గా మారింది. కొంతమంది ఆయనకు ఇంగ్లీష్ పూర్తిగా రాదు అందుకే మాట్లాడలేదని అనుకున్నారు. అయితే అది నిజం కాదు చంద్రబోస్ ఇంగ్లీష్ పూర్తిగా మాట్లాడగలరు. కానీ ఆస్కార్ వేడుకలో మాట్లాడలేదు. దీనికి కారణం ఆస్కార్ అకాడమీ రూల్ ప్రకారం అవార్డు అందుకున్న ఎవరైనా సరే 45 సెకండ్లకు మించి స్టేజిపై మాట్లాడకూడదు.
అది వాళ్ల రూల్. అందుకే చంద్రబోస్ మాట్లాడలేదని తెలుస్తోంది. అందుకే స్టేజ్ పై ఎం ఎం కీరవాణి మాట్లాడారని, చంద్రబోస్ చివర్లో నమస్తే అని చెప్పుకు వచ్చారని క్లారిటీ వచ్చింది. దీంతో చంద్రబోస్ ఎందుకు మాట్లాడలేదు అనేదానికి ఆన్సర్ దొరికింది. ఏదేమైనా ఆర్ఆర్ఆర్ సినిమా భారతీయ గౌరవాన్ని అమంతం పెంచేసింది. రాజమౌళి తెలుగువారి సత్తా ఏంటో ఈ సినిమాతో నిరూపించాడు. ప్రపంచ స్థాయిలో భారతీయ సినిమాకు గౌరవం దక్కేలా చేశారు. ఈ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబు తో పాన్ ఇండియా స్థాయిలో సినిమాను తెరకెక్కించబోతున్నాడు.