Ram Charan Allu Arjun : మరోసారి రామ్ చరణ్, అల్లు అర్జున్ మధ్య బయటపడ్డ విభేదాలు.. సమస్య ఏంటి..?
ప్రధానాంశాలు:
Ram Charan Allu Arjun : మరోసారి రామ్ చరణ్, అల్లు అర్జున్ మధ్య బయటపడ్డ విభేదాలు.. సమస్య ఏంటి..?
Ram Charan Allu Arjun : ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో పాన్ ఇండియా హీరోలుగా ఓ వెలుగు వెలుగుతున్నారు అల్లు అర్జున్, రామ్ చరణ్. రామ్ చరణ్‌కి ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ దక్కగా, అల్లు అర్జున్‌కి పుష్ప సినిమాతో గ్లోబల్ స్టార్‌డమ్ దక్కింది. అయితే మెగా హీరోలుగా చెబుతూ వస్తున్న ఈ ఇద్దరి హీరోల మధ్య సఖ్యత లేదని, వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని కొన్నాళ్లుగా అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. అల్లు – కొణిదెల కుటుంబాల మధ్య మనస్పర్థలు రావడం వల్లనే రామ్ చరణ్, బన్నీ కూడా దూరంగా ఉంటున్నట్టు టాక్ నడిచింది. అయితే వీటిని కొద్ది రోజుల క్రితం అల్లు అరవింద్ కొట్టిపారేశారు.
Ram Charan Allu Arjun పెరుగుతున్న విభేదాలు
ఇక చిరంజీవి మాట్లాడుతూ.. ఇప్పుడు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు అందరం కలుస్తూనే ఉంటాము… అని చెప్పుకొచ్చాడు. అయితే వారెంత క్లారిటీ ఇచ్చిన కూడా రూమర్స్ ఆగడం లేదు. అల్లు అర్జున్ మెగా హీరో ట్యాగ్ వదిలించుకొని తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ మంటైన్ చేయాలని చూస్తున్నాడని, ఈ క్రమంలోనే రామ్ చరణ్‌తో కూడా అంటీముట్టనట్టు ఉంటున్నాడని ప్రచారాలు జరుగుతున్నాయి. దీనికి మరింత బలాన్ని ఇస్తూ అల్లు అర్జున్ బర్త్‌డే రోజున రామ్ చరణ్ విష్ చేయకపోవడాన్ని సాక్ష్యంగా చూపుతున్నారు. ఏప్రిల్ 8న అక్కినేని అఖిల్ బర్త్ డే. ఆయనకు రామ్ చరణ్ ప్రత్యకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. డియర్ అఖిల్ అంటూ ప్రేమపూర్వకంగా విష్ చేసిన చరణ్.. బన్నీకి మాత్రం విష్ చేయలేదు.

Ram Charan Allu Arjun : మరోసారి రామ్ చరణ్, అల్లు అర్జున్ మధ్య బయటపడ్డ విభేదాలు.. సమస్య ఏంటి..?
ఈ క్రమంలో రామ్ చరణ్, బన్నీ అభిమానులు ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటున్నారు. ఈ వివాదం పెద్ద రచ్చగా మారేలా కనిపిస్తుంది. బన్నీతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టే రామ్ చరణ్ విష్ చేయలేదని కొందరు చెబుతున్నారు. ఇక గత ఏడాది కూడా అఖిల్ తో పాటు ఉన్న ఫోటో షేర్ చేసి బర్త్ డే విషెస్ చెప్పిన రామ్ చరణ్… అల్లు అర్జున్ కి మాత్రం పొడిపొడిగా విష్ చేయడంతో ఈ ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయని రచ్చ చేశారు. అయితే అలాంటివేమి వారి మధ్య లేవని, బన్నీ రామ్ చరణ్ బంధువు కాబట్టి నేరుగా కాల్ చేసి చెప్పడమో లేక కలిసి చెప్పడమో చేసి ఉంటాడని కొందరు అభిప్రాయపడుతున్నారు.