Jr NTR – Rana : యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, దగ్గుబాటి రానా వరుసకు బావబామ్మర్దులు.. ఎలాగంటే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jr NTR – Rana : యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, దగ్గుబాటి రానా వరుసకు బావబామ్మర్దులు.. ఎలాగంటే?

 Authored By mallesh | The Telugu News | Updated on :31 August 2022,12:40 pm

Jr NTR – Rana: టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి దగ్గుబాటి ఫ్యామిలీకి మధ్య చాలా స్ట్రాంగ్ రిలేషన్ షిప్ ఉంది. ఇప్పటికీ కూడా వీళ్ల కుటుంబాలు అంత అన్యోన్యంగా కలిసి ఉండటానికి అప్పట్లో ఇండస్ట్రీ దిగ్గజాలుగా ఓ వెలుగు వెలిగిన నందమూరి తారకరామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, రామానాయుడు గారి చలవే అంటారు కొందరు. ఎందుకంటే అప్పట్లో మెగా కుటుంబం అంతగా పాపులారిటీని సంపాదించుకోలేదు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాకే చిరు ఇండస్ట్రీకి స్టార్ హీరోగా ఎదిగారు.

Jr NTR – Rana : వరుసకు బావమరుదులు..

అప్పట్లో నందమూరి తారకరామాగారు తన కూతుర్లు, కొడుకులకు మంచి జీవితాలను కల్పించారు. ముఖ్యంగా తన కూతురు పురంధరేశ్వరిని రామానాయుడు గారి కొడుక్కు వెంకటేశ్వరరావుగారికి ఇచ్చి వివాహం జరిపించారు. దీంతో వీరి కుటుంబాల మధ్య సంబంధం ఏర్పడింది. అదే విధంగా రామానాయుడు గారు తన కూతురు లక్ష్మిని అక్కినేని వారసుడు నాగార్జునకు ఇచ్చి వివాహం జరిపించారు. ఇలా అక్కినేని, నందమూరి, దగ్గుబాటి కుటుంబాల మధ్య ఒక రిలేషన్ ఏర్పడింది. అయితే, కొంతకాలానికి అక్కినేని, దగ్గుబాటి కుటుంబాల మధ్య కొంత గ్యాప్ వచ్చిందని చెప్పుకోవచ్చు.

Relation Between Jr NTR and daggubati rana

Relation Between Jr NTR and daggubati rana

కారణం నాగార్జున రామానాయుడు గారి కూతురికి విడాకులు ఇచ్చి నటి అమలను ప్రేమవివాహం చేసుకున్న విషయం తెలిసిందే. లక్ష్మి కూడా అమెరికాలో సెటిల్ అయ్యి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది.వారికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇక నాగార్జున, లక్ష్మికి నాగచైతన్య జన్మించాడు. చిన్నతనంలో చైతూ బాధ్యతలను లక్ష్మి చూసుకున్నా.. పెద్దయ్యాక తండ్రి వద్దకు వచ్చి సినిమాల్లో చేరి హీరో అయ్యాడు.కాగా.. చైతూ, రానా, చెర్రీ వీళ్లంతా క్లాస్ మెట్స్.. ఇక తన మేనత్తను దగ్గుబాటి కుటుంబానికి ఇవ్వడంతో ఎన్టీఆర్ రానా వరుసకు బావమరుదులు అవుతారని తెలుస్తోంది.అందుకే వీళ్లు ఎప్పుడు ఎదురుపడినా బావా బావా అని పిలుచుకుంటారని అందరికీ తెలిసిందే.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది