Sara Ali Khan : గ్యాప్ లేకుండా.. ఆదివారం కూడా ఆ పని!.. ఊపేస్తోన్న సారా అలీ ఖాన్
Sara Ali Khan సారా అలీ ఖాన్ సినిమాల పరంగా పర్వాలేదనిపించింది. ఇక సింబా సినిమాతో అదిరిపోయే హిట్టును తన ఖాతాలో వేసుకుంది. రణ్ వీర్ సింగ్‌తో కలిసి వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకున్నాయి. అలా సారా అలీ ఖాన్ మంచి నటిగా, డ్యాన్సర్‌గా పేరు సంపాదించుకుంది. కానీ సారా అలీ ఖాన్ చేతిలో ఇప్పుడు ఎక్కువగా ప్రాజెక్ట్‌లు లేవు. సైఫ్ అలీ ఖాన్ కూతురిగా ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ డాటర్‌కు సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ క్రేజ్ ఉంటుంది.
సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ కలిసి చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఈ ఇద్దరూ కలిసి చేసిన వర్కవుట్లు, వాటికి సంబంధించిన వీడియోలు ఆ మధ్య తెగ వైరల్ అయ్యాయి. వర్కవుట్లో వారికి చెమటలు పట్టాల్సింది.. చూసే జనాలకు చెమటలు పట్టేశాయి. అలా ఈ భామలు వర్కవుట్లతో దుమ్ములేపేస్తుంటారు. అయితే దాదాపు అందరూ కూడా ఆదివారం నాడు కాస్త గ్యాప్ ఇస్తారు.
Sara Ali Khan సారా అలీ ఖాన్ వర్కవుట్లు
కానీ సారా అలీ ఖాన్ మాత్రం ఆదివారం కూడా వర్కవుట్లు చేసింది. ఆమె డెడికేషన్‌ను చూసి ట్రైనర్ కూడా షాక్ అయినట్టున్నాడు. వర్కవుట్లతో సారా అలీ ఖాన్ ఊపేస్తోంది. సండే నాడు కూడా వర్కవుట్లు చేసే వారే ఇలా ఉంటారు అని ట్రైనర్ అంటే.. ఆదివారం కూడా మాతో ఇలా చేయిస్తారు అని ట్రైనర్ గురించి సారా కౌంటర్ వేసింది. మొత్తానికి సారా వర్కవుట్లు మాత్రం ఇప్పుడు అందరినీ షాక్‌కు గురి చేస్తుంది.