Chandra Mohan : సీనియర్ హీరో చంద్రమోహన్ గురించి ఎవ్వరికీ తెలియని బ్రేకింగ్ న్యూస్ !
Chandra Mohan : టాలీవుడ్ లో ఒకప్పుడు మంచి హీరోగా పేరు సంపాదించుకున్నాడు చంద్రమోహన్. కేవలం హీరో గానే కాకుండా హీరో హీరోయిన్లకు తండ్రి పాత్రలు చేసి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు. ఇక ఇండస్ట్రీలో ఒకప్పటి స్టార్ హీరో శోభన్ బాబు, చంద్రమోహన్ ఎంతో మంచి స్నేహితులు. వీరిద్దరూ కలిసి చాలా సినిమాలలో నటించారు. ఇక చంద్రమోహన్ సోలో హీరోగా ఎన్నో సినిమాలలో నటించి లక్కీ హీరోగా పేరు సంపాదించుకున్నారు. అప్పట్లో చాలామంది హీరోయిన్ లు చంద్రమోహన్ […]
Chandra Mohan : టాలీవుడ్ లో ఒకప్పుడు మంచి హీరోగా పేరు సంపాదించుకున్నాడు చంద్రమోహన్. కేవలం హీరో గానే కాకుండా హీరో హీరోయిన్లకు తండ్రి పాత్రలు చేసి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు. ఇక ఇండస్ట్రీలో ఒకప్పటి స్టార్ హీరో శోభన్ బాబు, చంద్రమోహన్ ఎంతో మంచి స్నేహితులు. వీరిద్దరూ కలిసి చాలా సినిమాలలో నటించారు. ఇక చంద్రమోహన్ సోలో హీరోగా ఎన్నో సినిమాలలో నటించి లక్కీ హీరోగా పేరు సంపాదించుకున్నారు. అప్పట్లో చాలామంది హీరోయిన్ లు చంద్రమోహన్ తో సినిమా చేయాలని ఎదురు చూసేవారు.
ఆయనతో కలిసి ఒక సినిమాలో నటిస్తే హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటామని అనే నమ్మకంతో చాలామంది ఎదురు చూసేవారు. అలా అతిలోక సుందరి శ్రీదేవి కూడా తన మొదటి సినిమాను చంద్రమోహన్ తోనే కలిసి నటించింది. ఆ సినిమాతో ఆమె స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. శ్రీదేవి, జయసుధ, జయప్రద లాంటి హీరోయిన్ లంతా చంద్రమోహన్ తో కలిసి నటించారు. తమ మొదటి సినిమాని చంద్రమోహన్ తో కలిసి నటించి స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక చంద్రమోహన్ నటన పరంగా మంచి గుర్తింపున దక్కించుకున్నారు.
ఎమోషనల్ సీన్స్ మాత్రమే కాకుండా కామెడీ కూడా బాగా పండిస్తారు. చాలా సినిమాలో హీరోలకు తండ్రి పాత్రలో నటించాడు. సినిమాలోనే కాకుండా నిజ జీవితంలో ఇలాంటి తండ్రి ఉండాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇకపోతే చంద్రమోహన్ సినిమాల ద్వారా సంపాదించిన డబ్బు మొత్తం లైన్స్ పైనే ఇన్వెస్ట్ చేస్తారట. వీటి విలువ ఇప్పుడు కోట్లలో ఉంటుంది. అందుకే ఈయనను ఇండస్ట్రీలో కుబేరుడు అని కూడా అంటారు. ప్రస్తుతం ఆయనకు సినిమాలలో అవకాశాలు వస్తున్నప్పటికీ నటించడానికి ఒప్పుకోవడం లేదు.