Jagapati Babu: జగపతి బాబును తిట్టిన బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్.. ఎందుకో తెలుసా..?
Jagapati Babu: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘అంతఃపురం’. ఈ సినిమాలో డైలాగ్ కింగ్ సాయి కుమార్, సౌందర్య జంటగా నటించారు. జగపతి బాబు కీలక పాత్రలో కొద్దిసేపు నటించారు. ప్రకాష్ రాజ్ – శారద ముఖ్యపాత్రలో నెగిటివ్ రోల్ చేశారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. అప్పటి వరకు కంప్లీట్ కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు చేసిన సౌందర్య అంతఃపురం లాంటి సినిమాను ఒప్పుకోవడం గొప్ప విషయం.

shahrukh khan scolded jagapati babu
పైగా ఇందులో హీరో సాయి కుమార్ అంటే కూడా సౌందర్య ఎలా ఒప్పుకుందో అని అందరూ షాకయ్యారు కూడా. ఇక స్టార్ హీరోగా భారీ సక్సెస్‌లు అందుకుంటున్న జగపతి బాబు ఓ చిన్న పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడంటే కూడా చాలామంది నమ్మలేకపోయారు. అయితే అక్కడ ఉంది డైరెక్టర్ కృష్ణవంశీ. తన వెనక ఉంది సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ. అప్పటికే వర్మ దర్శకత్వంలో జగపతి బాబు గాయం సినిమా చేసి హిట్ అందుకున్నాడు. అంతేకాదు ప్రతీ ఒక్కరు జగపతి బాబు వాయిస్ బాగోదని విమర్శించారు.
Jagapati Babu: జగపతిబాబు వాయిస్ ప్రపంచానికి పరిచయం చేసింది వర్మే.
కానీ వర్మ మాత్రం నీ వాయిస్ అద్భుతంగా ఉంది.. ఇప్పటి నుంచి నువ్వే సొంతగా డబ్బింగ్ చెప్పు అని ఆయన సినిమాకి చెప్పించాడు. అలా జగపతి బాబు వాయిస్ ప్రపంచానికి పరిచయం చేసింది వర్మే. ఆ రకంగా జగ్గుబాయ్ అంతఃపురంలో నటించే అవకాశం అందుకున్నాడు. అయితే ఈ సినిమాలో ఆయన కనిపించేది క్లైమాక్స్‌లో కొద్దిసేపే. దానికి ముందు ఓ సాంగ్. కానీ ఎంత హైలెట్ అయ్యాడో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ప్రకాష్ మనుషుల నుంచి హీరోయిన్ సౌందర్య, తన కొడుకుని తప్పించడానికి సహాయం చేసే పాత్రలో నటించాడు. ఈ పాత్ర స్వభావం ఊర మాస్. ఎప్పుడు సిగరెట్ మందు తాగుతూ ఉండే పాత్ర. ఆ పాత్రలో జగపతి బాబు అద్భుతంగా నటించాడు.

shahrukh khan scolded jagapati babu
Jagapati Babu: ‘బాస్టడ్’ అనేది తిట్టే అయినా, అక్కడ జగపతిని షారుఖ్ పొగడ్తతో కాంప్లిమెంట్ ఇచ్చాడు.
ఇక ఇదే సినిమా హిందీలో కూడా తెరకెక్కించారు. అక్కడ కూడా దర్శకుడు కృష్ణవంశీ. సౌందర్య పాత్రను కరిష్మా కపూర్, ప్రకాష్ రాజ్ పాత్రను నానా పాటేకర్, జగపతి బాబు పాత్రను బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ పోషించాడు. అయితే జగపతి బాబులా షారుఖ్ నటించడానికి చాలా కష్టపడ్డాడు. ఎంత కష్టపడినా ఫైనల్‌గా జగపతిలా చేయలేకపోయాడు. దాంతో ‘బాస్టడ్ ..ఎలా చేశాడు ఈ క్యారెక్టర్..పర్ఫార్మెన్స్’ అని మెచ్చుకున్నాడు. ‘బాస్టడ్’ అనేది తిట్టే అయినా, అక్కడ జగపతిని షారుఖ్ పొగడ్తతో కాంప్లిమెంట్ ఇచ్చాడు.

shahrukh khan scolded jagapati babu