Shannu : బాత్రూం ఏరియాలో హగ్గులతో రచ్చ.. షన్ను, సిరిలు ఇక మారరు
Shannu : బిగ్ బాస్ ఇంట్లో షన్ను, సిరిల వ్యవహార ధోరణి ఎప్పటికీ మారదు. చెప్పుకోవడం మాత్రం స్నేహితులమేనని అంటారు. కానీ చేసే పనులు మాత్రం అలా ఉండవు. బిగ్ బాస్ ఇంట్లో సిరి, షన్నుల పద్దతిపై అందరికీ వికారం కలుగుతోంది. సిరి, షన్నులు చేసుకునే హగ్గులు, సిరిపెట్టే ముద్దులు ఎలా వైరల్ అయ్యాయో.. ఇంకా అవుతున్నాయో అందరికీ తెలిసిందే.
అయితే రోజూ జరిగే ఎపిసోడ్‌లో షన్ను, సిరి హగ్స్ మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే. రోజూ ఏదో ఒక గొడవ జరగాల్సిందే. అలకలు ఉండాల్సిందే. మళ్లీ వెంటనే కలిసిపోవాల్సిందే. అయితే హగ్గులు మాత్రం కంపల్సరీ. హత్తుకోవడం లేకుండా ఉంటే మాత్రం బిగ్ బాస్ ఒప్పుకోడన్నట్టుగా ఈ ఇద్దరి వ్యవహారం తయారైంది. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో సిరి, షన్ను బాత్రూం ఏరియాలో చేసిన కంపు మాత్రం మామూలుగా లేదు.

Siri And Shannu Romance In Bathroom Area in Bigg Boss 5 Telugu
Shannu : సిరి, షన్ను రొమాన్స్..
నిన్నటి టాస్కుల్లో షన్ను సూర్యలా, సిరి జెనీలియాలా, సన్నీ బాలయ్యలా ఇలా హీరోల పాత్రలను పోషించారు. అయితే సిరి నిన్న మిగతా అందరితో కలిసి బాగానే ఎంజాయ్ చేసింది. తనతో ఎక్కువ సేపు ఉండలేదనే ఉద్దేశ్యమో, లేదా మిగతా వాళ్లతో కలిసిపోతోందనే కోపమోగానీ సిరి మీద అలిగాడు షన్ను. ఇక మనోడి అలక తీర్చేందుకు బాత్రూం ఏరియాలో గట్టిగా హత్తుకుంది.