Singer Sunitha : ఆ ఒక్క వ్యక్తి అనుమానించేవారా!.. సింగర్ సునీత చెప్పింది అదేనా?
Singer Sunitha ప్రస్తుతం సమాజం ఎలా ఉందో? ఎలా ఆలోచిస్తోందో చెప్పాల్సిన పని లేదు. ఓ ఆడ, మగ కలిసి నడుస్తుంటే.. వారిద్దరి మధ్య ఏదో ఉందనేట్టుగా మాట్లాడుతుంది ఈ సమాజం. ఆ వెళ్లేది అన్నా చెల్లెళ్లు అయినా కూడా ఆ విషయం తెలియని, తెలుసుకోని ఈ సమాజం నానా రకాలుగా మాట్లాడుకుంటూఉంటుంది. అయితే ఇదే విషయాన్ని చెబుతూ డ్రామా జూనియర్స్ షోలో పిల్లలు స్కిట్ వేశారు. ఆ స్కిట్ జడ్జ్ అయిన సునీత Singer Sunitha ను కదిలించినట్టుంది. తన జీవితంలో జరిగిన సంగతిని కూడా వివరించింది.

Singer Sunitha Gets Emotional In Drama Juniors
సింగర్ సునీత చెప్పింది అదేనా Singer Sunitha
ఓ అమ్మాయి, అబ్బాయి ఫ్రెండ్స్‌లా ఉంటే కూడా ఈ సమాజం ఊరికే వదిలి పెట్టదు అనే కాన్సెప్ట్‌తో పిల్లలు స్కిట్ వేశారు. ఇందులో ఓ అమ్మాయికి మగ ఫ్రెండ్ ఉంటారు. అలా ఫ్రెండ్ ఉన్నాడని, మిగతా ఫ్రెండ్స్ వాళ్లింటి సభ్యులు ఈ అమ్మాయితో కలవనివ్వరట. పైగా ఆమెను నిందిస్తుంటారు. అబ్బాయిలతో తిరుగుతావని హేళన చేస్తుంటారు. ఇక ఆఫీస్‌లోనూ అలాంటి ఘటనే ఎదురువుతుందట. ఇలా పిల్లలు వేసిన స్కిట్లపై సునీత స్పందించింది.

Singer Sunitha Gets Emotional In Drama Juniors
అమ్మాయికి అబ్బాయి ఫ్రెండ్ ఉండకూడదా?.. అంటూ ప్రశ్నించే స్కిట్ అందరినీ కదిలించింది. దీనిపై సునీత Singer Sunitha స్పందిస్తూ.. రోడ్డు మీద వెళ్లే ఆ ఆంటీ, ఆఫీస్‌లో ఉన్న ఆ బాస్.. ఇవన్నీ కలిపి నా జీవితంలో ఒకే ఒక్క క్యారెక్టర్ అన్నమాట. కొన్ని కొన్ని సార్లు కుటుంబ సభ్యుల కంటే స్వచ్చంగా ఎవరైనా ఉంటారా? అంటే అది కేవలం స్నేహితులే అని సునీత చెప్పుకొచ్చింది. అంటే తనను అనుమానించిన ఆ ఒకే ఒక్క క్యారెక్టర్ ఎవరు? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
ఇది కూడా చదవండి ==> ఆ ఒక్క మాట చాలు.. బాలయ్యపై యాంకర్ ప్రదీప్ కామెంట్స్
ఇది కూడా చదవండి ==> అత్తింట్లో గొడవలు.. నిహారిక భర్తపై పోలీసులకు ఫిర్యాదు.. అసలు ఏం జరిగింది…?
ఇది కూడా చదవండి ==> జాన్వీ కపూర్ పెళ్ళి ఎక్కడో ఫిక్సైపోయింది..పెళ్ళి కబురు చెబుతున్న శ్రీదేవి కూతురు..!
ఇది కూడా చదవండి ==> జబర్దస్త్ టీం కి షాకిచ్చిన మల్లెమాల.. రెమ్యునరేషన్ కట్.. ఎందుకంటే..?