NTR : ఆ సమయంలో అతడు ఎన్టీఆర్‌ను మించిపోతాడనుకున్నారు.. కానీ చివరకు..!
NTR : ప్రజెంట్ టైమ్స్‌లో సినిమాల్లోకి రావాలనుకున్న వారికి గతంతో పోల్చితే ప్రాసెస్ కొంచెం సింపుల్ అయిపోయింది. తమ టాలెంట్‌ను సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవడం ద్వారా ఎవరికైనా నచ్చితే ఆటోమేటిక్‌గా చాన్స్ వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి. నటులు కావలెను అన్న ప్రకటన చూసి కూడా మీరు మీ డీటెయిల్స్ వారికి పంపితే వారు మిమ్మల్ని సెలక్ట్ చేసుకోవచ్చు. అయితే, ఒకప్పుడు అనగా తెలుగు సినిమా ప్రారంభంలో ఇటువంటి పరిస్థితులు లేవు.సినిమాల్లో నటించాలంటే చాలా కష్టమైన పని అని అప్పట్లో భావించేవారు. ఎందుకంటే దర్శక, నిర్మాతలు అసలు ఎవరికీ దొరికే వారు కాదు. వారి వద్దకు వెళ్లి తమకు వెండితెరపైన ఒక అవకాశం ఇవ్వాలని అడగడం కష్టసాధ్యమైన పని అనే చెప్పొచ్చు. అటువంటి సమయంలో ఓ కుర్రాడికి తెలుగు వెండితెర హీరోగా అవకాశం ఇచ్చింది.
అతడు తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు కూడా. అతడు ఎవరంటే.. బుద్ధరాజు వెంకట అప్పల హరనాథ రాజు.. తెలుగు సినిమాల్లో మంచి మంచి పాత్రలు పోషించిన హరినాథరాజు అప్పట్లో ప్రేక్షకుల చేత విశేష ఆదరాభిమానాలు పొందాడు. అది చూసి చాలా మంది ఇతడు ఎన్టీఆర్ తర్వాత ఘనుడని కీర్తించారు. కొందరు అయితే ఏకంగా ఇతను ఎన్టీఆర్‌ను మించిపోతాడని జోస్యం కూడా చెప్పారు. కానీ, అతడు ఆ తర్వాత కాలంలో కనబడకుండా పోయాడు. మద్యానికి బానిసై తన కోసమై వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యాడు. దాంతో అతను హీరో అన్న సంగతే ప్రజలు మరిచిపోయారు. అయితే, అతడు అలా కావడానికి కారణం డబ్బేనట. ఒక్కసారిగా స్టార్ డమ్ రావడంతో తాను హీరోనని అనుకుని హరనాథ్ తాగుడుకు బానిసయ్యాడు.
NTR : పలు చిత్రాల్లో కథానాయకుడిగా జననీరాజనాలు అందుకున్న హరనాథ్..
అమ్మాయిల వ్యసనంతో పాటు మద్యానికి బానిసై ఆ తర్వాత కాలంలో సినిమాలను దూరం పెట్టాడు. సీనియర్ నటుడు ఎస్వీ రంగారావుతో స్నేహం చేసిన హరనాథ్ ఆ తర్వాత కాలంలో అసలు కనబడకుండా పోయాడు. హరినాథ్ మద్యానికి బానిసవుతున్న క్రమంలో ఎన్టీఆర్ పిలిచి మందలించారట. కానీ, ఎన్టీఆర్ మాటలను హరనాథ్ అస్సలు పట్టించుకోలేదట.