Mega Family : మెగా ఫ్యామిలీలో ఒక‌టి క‌న్నా ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంది వీరే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mega Family : మెగా ఫ్యామిలీలో ఒక‌టి క‌న్నా ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంది వీరే..!

 Authored By sandeep | The Telugu News | Updated on :8 August 2022,4:20 pm

Mega Family: టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీకి ప్ర‌త్యేక స్థానం ఉంటుంద‌న్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా చిరంజీవి – Chiranjeevi వ‌ల‌న మెగా ఫ్యామిలీకి స‌ప‌రేట్ గుర్తింపు ద‌క్కింది. మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ కొణిదెల – Sreeja Konidela గురించి గత కొద్దిరోజులుగా మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆమె తన రెండో భర్త కళ్యాణ్ దేవ్ నుంచి విడాకులు తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఏకంగా మూడో పెళ్లికి సిద్ధం అయిందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మెగా ఫ్యామిలీలో ఎవ‌రు ఒక‌టి క‌న్నా ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్నార‌నే విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Mega Family: పెళ్లిపై అంత మోజా?

నాటి కాలంలో పెళ్లి అంటే నిండు నూరేళ్ళు ఉండాలని, ఏడు జన్మలకు ఓకే భర్త దొరకాలని కలలు కనేవారు.కానీ ఇప్పుడు మాత్రం రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.అలా మన మెగా ఫ్యామిలీలో ఎంతమంది రెండు లేదా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – Pawan Kalyan సినిమాల్లోకి రాకముందు వైజాగ్ కు చెందిన నందినిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత తనతో బద్రి – జానీ సినిమాలలో నటించిన రేణు దేశాయ్ – Renu Desai ను రెండో పెళ్లి చేసుకోగా… తీన్మార్ సినిమాలో నటించిన రష్యన్ అమ్మాయి అన్నా లెజ్నోవా ను మూడో పెళ్లి చేసుకున్నారు. ఇక చిరంజీవి చెల్లెలు ప్రముఖ హీరో సాయి ధరమ్ తేజ్ – Sai Dharam Tej తల్లి విజయ‌దుర్గ‌కు కూడా పెళ్లి కలిసి రాలేదు.

Sreeja Konidela mega family members marries more than one person

Sreeja Konidela mega family members marries more than one person

సాయిధరమ్ తేజ్ – వైష్ణవ తేజ్ పుట్టాక భర్తతో విడాకులు రావడంతో చాలా రోజులపాటు భర్తకు దూరంగానే ఉంది. వీరిద్దరూ పెరిగి పెద్దయ్యాక ఈ వయసులో తనకు తోడు కావాలనుకున్న విజయదుర్గ ఓ డాక్టర్‌ను రెండో పెళ్లి చేసుకుంది. ఇక చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ ముందుగా తాను ప్రేమించిన శిరీష్ భరద్వాజ్‌ను ఇంట్లో నుంచి వెళ్లిపోయి మరి పెళ్లి చేసుకుంది. అత‌ని నుండి విడిపోయాక‌ కళ్యాణ్ దేవ్‌ని పెళ్లి చేసుకొని ఓ ఆడపిల్లకు జన్మినిచ్చింది. ఇప్పుడు కళ్యాణ్ దేవ్‌కు కూడా ఆమె విడాకులు ఇస్తుందన్న వార్తలు వస్తున్నాయి.అగ్ర నిర్మాత అల్లు అరవింద్ – Allu Aravind పెద్ద కుమారుడు అల్లు బాబి కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదట భార్యతో ఒక కూతురు పుట్టాక విడిపోయి ఇప్పుడు ముంబైకి చెందిన డిజైనర్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది