Sreemukhi : పోరా ఎర్రి * స్టేజ్ మీద పచ్చి బూతులతో రెచ్చిపోయిన శ్రీముఖి
Sreemukhi : బుల్లితెరపై డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేని షో అంటూ ఏదీ ఉండదు. అన్నింట్లో అవే రాజ్యమేలుతుంటాయి. డబుల్ మీనింగ్ డోసేజ్ ఎంత పెంచితే రేటింగ్లు అంతగా వస్తాయనే భ్రమలో ఉంటారు నిర్వాహకులు. ఇక డైరెక్షన్ టీంకు ఎలాగూ బుద్ది ఉండదని అనుకుంటే.. ఆ డైలాగ్స్ చెప్పే సెలెబ్రిటీలకూ బుద్ది ఉండదని అనిపిస్తోంది. మరీ ముఖ్యంగా లేడీ యాంకర్లు సైతం డబుల్ మీనింగ్ డైలాగ్‌లకు అలవాటు పడుతున్నారు. ఇక ఇందులో శ్రీముఖి ఇప్పుడు అందరికంటే ముందుంటోంది.
జాతి రత్నాలు అనే స్టాండప్ కామెడీ షోలో అందరూ రెచ్చిపోతోన్నారు. శ్రీముఖి, నూకరాజు, ఇమాన్యుయేల్, పంచ్ ప్రసాద్ ఇలా అందరూ కలిసి జాతి రత్నాలు షోను నిలబెట్టేశారు. అయితే అందులో స్టాండప్ కామెడీ చేసేందుకు వచ్చిన వారిలో కొంత మంది హద్దులు దాటుతుంటారు. వాళ్లు కామెడీ చేసేందుకు ఎంచుకునే థీమ్‌లు, వాడే పదాలు, వేసే డబుల్ మీనింగ్ పంచులు దారుణంగా ఉంటాయి. పూర్తిగా అడల్ట్ షో అన్నట్టుగానే ఉంటుంది. ఇక ఇందులో శ్రీముఖి తాజాగా మరింత హద్దులు దాటినట్టు అనిపిస్తుంది.
Sreemukhi : హద్దులు దాటిన శ్రీముఖి..
ఒక అమ్మాయి లేచి తన పేరు మణిమాలిక అని అంటుంది. నీ పేరు మణిమాలిక నీ పేరు మణిమాలిక నిన్న పీకాను కోడి ఈక అని ఇమాన్యయేల్ కామెడీ చేస్తాడు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. అయితే ఆ తరువాత శ్రీముఖి దారి తప్పింది. నీ పేరు మాణిమాలిక నీ పేరు మణిమాలిక.. పోరా ఎర్రి అని అంతటితో ఆపేసింది. ఆ తరువాత ఏ పదం వాడుతుందో అందరికీ అర్థమై ఉంటుంది. ఆమె ఆ పదం ఎక్కడ అనేస్తుందో అని.. ఇమాన్యుయేల్, నూకరాజు తెగ భయపడుతుంటారు. మిగతా అందరూ పగలబడి నవ్వేస్తుంటారు.
ఇలాంటివి శ్రీముఖికి తగునా? అనేట్టుగా వ్యవహరిస్తోంది. దాన్ని కవర్ చేసేందుకు ఇమాన్యుయేల్ ఇంకో పంచ్ వేస్తాడు. నీ పేరు మణిమాలిక.. నీ పేరు మణిమాలిక.. ప్రసాద్ అన్న ఆస్పత్రికి వెళ్తాడు ఆరోగ్యం బాలేక అంటూ పంచ్ ప్రసాద్ మీద కౌంటర్లు వేస్తాడు. అలా డైవర్ట్ చేసేస్తాడు.
