Sreemukhi : స్లిమ్‌గా మారిన శ్రీముఖి.. చీరకట్టులో అందాల ముద్దుగుమ్మ రచ్చ మాములుగా లేదు..!
Sreemukhi : చలాకీ మాటలతో పాటు తన అందచందాలతో కుర్రకారు మతులు పోగొడుతున్న అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి. ఎనర్జిటిక్ యాంకర్ గా, బుల్లితెర రాములమ్మగా గుర్తింపు సొంతం చేసుకుంది శ్రీముఖి. శ్రీముఖి అందంతో కూడా అభిమానులని ఆకర్షిస్తూ ఉంటుంది. ఎలాంటి షోలో అయినా కామెడీ పంచ్ లతో శ్రీముఖి చెలరేగిపోతుంది. బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే వెండితెరపై కూడా మెరవాలని శ్రీముఖి ప్రయత్నిస్తోంది. సినిమాల్లో అప్పుడప్పుడూ వస్తున్న ఆఫర్స్ ని ఉపయోగించుకుంటోంది. శ్రీముఖికి బిగ్ బాస్ హౌస్‌లో ఉండగా.. తన డార్క్ లవ్ స్టోరీ గురించి ఆమె స్వయంగా చెప్పింది. అందరి అమ్మాయిల్లాగే తాను ఒక అబ్బాయిని ప్రేమించానని.. ఈ పర్సనల్ మ్యాటర్ ఇంతకు ముందు ఎక్కడ చెప్పలేదని..
తాను ఓ పాపులర్ వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడిపానని చెప్పింది.పలు విషయాలతో నిత్యం వార్తలలో నిలుస్తూ ఉంటుంది శ్రీముఖి. అలానే సోషల్ మీడియాలోను ఈ అమ్మడు రచ్చ మాములుగా ఉండదు. ఇటీవల స్లిమ్‌గా మారిన శ్రీముఖి తాజాగా చీరకట్టులో అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేస్తుంది. శ్రీముఖి స్టన్నింగ్ లుక్స్ కుర్రకారు మతులు పోగొడుతున్నాయి. అమ్మడి క్యూట్ లుక్స్ కి ప్రతి ఒక్కరు థ్రిల్ అవుతున్నారు. శ్రీముఖి గత ఏడాది ‘క్రేజీ అంకుల్స్’ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే నితిన్ మ్యాస్ట్రో మూవీలో శ్రీముఖి మెరిసింది.

sreemukhi latest photos in Viral
Sreemukhi : శ్రీముఖి సందడి మాములుగా లేదు..
మ్యాస్ట్రో మూవీ ఓటిటిలో విడుదలై విజయం అందుకున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం శ్రీముఖి మెగాస్టార్ చిరంజీవి బోళా శంకర్ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇదిలా ఉండగా శ్రీముఖి ప్రస్తుతం పలు టీవీ కార్యక్రమాలలో సందడి చేస్తోంది. సీనియర్ యాంకర్ సుమ హోస్ట్ గా చేస్తున్న శ్రీరామనవమి స్పెషల్ క్యాష్ ప్రోగ్రాంలో శ్రీముఖి పాల్గొంది. ఇటీవల ఆ ప్రోగ్రాంలో పలు విషయాలు వెల్లడించింది. శ్రీముఖి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఈటీవీలో ‘జాతి రత్నాలు’ అంటూ పటాస్ తరహా షోతో అలరిస్తున్న ఈ యాంకర్ పాప.. పలు స్పెషల్ షోస్‌లోను సందడి చేస్తుంది.