Sridevi Drama Company : శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చిన తర్వాత ఆ షో లు అన్ని కూడా చాలా లైట్ అయ్యాయి

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 22 March 2022, 11:00 am

Sridevi Drama Company : ఒకప్పుడు తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు పండగ వస్తోందంటే.. కొత్త సంవత్సరం వస్తుందంటే.. ఇంకా ఇతర ప్రత్యేక రోజులు ఏమైనా రాబోతున్నాయి అంటే ఈటీవీ లో ప్రసారమయ్యే ప్రత్యేక కార్యక్రమం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవారు. కన్నుల పండుగగా ఎంతో మంది బుల్లి తెర సెలబ్రిటీలు మరియు వెండి తెర సెలబ్రిటీలు పండుగ సందర్భంగా ఆ కార్యక్రమాల్లో సెలబ్రేట్ చేసుకునే వారు. కానీ ఇప్పుడు పండుగ స్పెషల్ కార్యక్రమాలపై అంత ఇంట్రెస్ట్‌ ఉండడం లేదు. జనాలు పండుగ స్పెషల్ కార్యక్రమాలను అసలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అలాంటి స్పెషల్ కార్యక్రమం ప్రతి ఆదివారం కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ రూపంలో వచ్చేస్తుంది.పండుగ స్పెషల్ అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ షో మాదిరిగానే ఉంటుంది.

కనుక ఇప్పుడు పండుగ స్పెషల్ కార్యక్రమాలు వచ్చినా కూడా జనాలు లైట్ తీసుకుంటున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ ని మించి ఆ షో ఏమీ కచ్చితంగా గొప్పగా ఉండదు అని ప్రతి ఒక్కరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వారం శ్రీదేవి డ్రామా కంపెనీ వస్తున్నప్పుడు ప్రత్యేకంగా పండగ స్పెషల్ ఎపిసోడ్ చూడాల్సిన అవసరం ఏముంది అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి శ్రీదేవి డ్రామా కంపెనీ వల్ల ఈటీవీ లోనే కాకుండా ఇతర ఛానళ్ళలో కూడా ప్రసారం చేస్తున్న పండగ స్పెషల్ కార్యక్రమాల్లో జోరు తగ్గింది.శ్రీదేవి డ్రామా కంపెనీ లో ఎలా అయితే కన్నుల పండుగగా ఎంతో మంది సెలబ్రిటీలు కనిపిస్తారో అచ్చు అలాగే పండుగ స్పెషల్ ఎపిసోడ్లో కూడా లెక్కలేనంత మంది సెలబ్రెటీలు కనిపిస్తూ సందడి సందడి చేసేందుకు ప్రయత్నిస్తారు.

sridevi drama company hangama like festival special shows and events

sridevi drama company hangama like festival special shows and events

కనుక శ్రీదేవి డ్రామా కంపెనీ ని చూసిన వారు ఆ పండగ స్పెషల్ చూడాల్సిన అవసరం ఏమిటి అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈటీవీ తో పాటు స్టార్ మా జీ తెలుగు ఛానల్ లో కూడా పండగ స్పెషల్ కి సంబంధించిన ఎపిసోడ్ ల జోరు తగ్గింది. మొత్తానికి శ్రీదేవి డ్రామా కంపెనీ వల్ల పండగు స్పెషల్‌ ఈవెంట్ లు భవిష్యత్తులో కనిపించుకుండా పోతాయి అంటూ బుల్లి తెర వర్గాల వారు చర్చించుకుంటున్నారు. ఈటీవీ లో ప్రతి ఆదివారం ప్రసారమౌతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ సుధీర్ హోస్టు గా వ్యవహరిస్తూ ఉండగా ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. రాంప్రసాద్, హైపర్ ఆది లు కీలక భూమిక పోషిస్తున్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp