Pushpa Srivalli Song : శ్రీవల్లి సాంగ్ కు గూగుల్ కూడా ఫిదా.. 2022 లో గూగుల్ టాప్ సాంగ్స్ లో శ్రీవల్లి పాటకు చోటు

Advertisement

Pushpa Srivalli Song : శ్రీవల్లి పాట తెలుసు కదా. పుష్ప సినిమా ఎంత హిట్ అయిందో.. శ్రీవల్లి పాట కూడా అంతే హిట్ అయింది. అసలు ఎక్కడ చూసినా శ్రీవల్లి పాట గురించే చర్చ. చూపే బంగారమాయెనే శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయనే అంటూ అల్లు అర్జున్ చెప్పు జారవిడుచుకొని మరీ డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే కదా. నిజానికి ఈ పాట తెలుగులో కంటే కూడా హిందీలో బాగా హిట్ అయింది. హిందీలో ఈ పాటను జావెద్ అలీ పాడాడు. అయితే.. విచిత్రం ఏంటంటే.. తెలుగు పాట కంటే కూడా హిందీ పాటకు చాలా రెస్పాన్స్ వచ్చింది. నార్త్ తో అయితే ఎక్కడ చూసినా ఈ పాట కొన్ని రోజుల పాటు మారుమోగిపోయింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన పుష్ప సినిమా సంచలనాలను సృష్టించింది.  దేశవ్యాప్తంగా రికార్డులను బద్దలు కొట్టింది.

ముఖ్యంగా హిందీలో అయితే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా విడుదలై సరిగ్గా సంవత్సరం అవుతోంది. 2021 డిసెంబర్ లో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ మేనరిజమ్స్ మాత్రం అదిరిపోయాయి. తగ్గేదేలే అంటూ తన తల కింద చేయి పెట్టి తిప్పడం అందరికీ నచ్చింది. దీంతో అప్పట్లో అదే పెద్ద ట్రెండ్ అయిపోయింది. సినిమాతో పాటు.. అందులోని అన్ని పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అయితే.. గూగుల్ టాప్ సాంగ్స్ లో శ్రీవల్లి పాటకు మాత్రం చోటు దక్కింది. ప్రస్తుతం 2022 సంవత్సరం ముగింపు దశలో ఉన్నాం. ఇంకో 23 రోజులు అయితే 2023 ప్రారంభం అవుతుంది. దీంతో ఈ సంవత్సరం గూగుల్ లో టాప్ ట్రెండింగ్ లో ఉన్న పలు టాపిక్స్ కు సంబంధించిన డేటాను గూగుల్ రివీల్ చేసింది. అందులో టాప్ సాంగ్స్ లిస్టులో శ్రీవల్లి పాట ఉంది. టాప్ సాంగ్స్ లిస్టులో శ్రీవల్లి పాటకు పదో స్థానం దక్కింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడాడు.

Advertisement
srivalli song from pushpa gets a place in google to songssrivalli song from pushpa gets a place in google to songs
srivalli song from pushpa gets a place in google to songs

Pushpa Srivalli Song : 10 వ స్థానం దక్కించుకున్న శ్రీవల్లి

హిందీలో మాత్రం జావెద్ అలీ పాడాడు. ఈ పాటకు గూగుల్ కూడా ఫిదా అయిపోయింది. దేశవ్యాప్తంగా కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఈ పాటకు పదో స్థానం లభించింది. ఇక.. అలీ సేథి పసూరి పాటకు మొదటి స్థానం లభించింది. బీటీఎస్ బట్టర్ పాటకు రెండో స్థానం లభించగా… అందులో చాంద్ బాలియాన్, డాగన్ బిలీవర్, బ్యాక్ స్ట్రీట్ బాయ్స్ ఎవ్రీడే అనే పాటలు కూడా టాప్ 10 లో చోటు దక్కించుకున్నాయి. మొత్తానికి శ్రీవల్లి పాటకు గూగుల్ సెర్చ్ లో టాప్ ప్లేస్ దక్కడంపై మూవీ యూనిట్ కూడా ఖుషీ అవుతోంది. ఈ సినిమాకు సీక్వెల్ పుష్ప ది రూల్ షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ సినిమా వచ్చే సంవత్సరం విడుదలవుతుంది. ఈ సినిమాలోనూ ఫస్ట్ పార్ట్ లో ఉన్న క్యారెక్టర్లనే కొనసాగిస్తూ కథను పెంచారు. ఈ సినిమాకు సుకుమార్ డైరెక్టర్. చూద్దాం మరి.. సెకండ్ పార్ట్ ను సుకుమార్ ఇంకెంత బ్లాక్ బస్టర్ చేస్తాడో?

Advertisement
Advertisement