Bigg Boss Telugu 7 : సూపర్ ట్విస్ట్.. ఈ వారం గౌతమ్, శుభశ్రీ ఔట్.. బిగ్ బాస్ 2.0 షురూ.. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో కొత్త కంటెస్టెంట్లు.. ఎవరో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss Telugu 7 : సూపర్ ట్విస్ట్.. ఈ వారం గౌతమ్, శుభశ్రీ ఔట్.. బిగ్ బాస్ 2.0 షురూ.. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో కొత్త కంటెస్టెంట్లు.. ఎవరో తెలుసా?

 Authored By kranthi | The Telugu News | Updated on :8 October 2023,1:00 pm

Bigg Boss Telugu 7 : ఇది కదా ట్విస్ట్ అంటే. ఇది కదా ప్రేక్షకులకు కావాల్సింది. ఇదే కావాల్సింది. ఇప్పటి వరకు వచ్చిన బిగ్ బాస్ సీజన్లన్నీ ఒక ఎత్తు.. ఇప్పుడు వచ్చిన బిగ్ బాస్ సీజన్ 7 ఒక ఎత్తు. అందుకే ఈ సీజన్ ను బిగ్ బాస్ 2.0 అని పిలవచ్చు. ఇప్పటి వరకు 5 వారాలు అయిపోయాయి. ప్రస్తుతం హౌస్ లో 10 మంది ఉన్నారు. నలుగురు ఎలిమినేట్ అయ్యారు. ఇవాళ ఒకరు ఎలిమినేట్ కావాలి. కానీ.. అందరూ అనుకుంటున్నట్టు ఈ వారం ఒక్కరు కాదు.. ఇద్దరు ఎలిమినేట్ అవుతున్నారు. అవును.. ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. అది కూడా జంటగా. శుభశ్రీ, గౌతమ్ ఇద్దరూ ఎలిమినేట్ అయ్యారు. ఇద్దరినీ బిగ్ బాస్ ఎలిమినేట్ చేయగా ప్రస్తుతం హౌస్ లో మిగిలింది ఎనిమిది మందే. అసలు బిగ్ బాస్ ఇద్దరిని ఎందుకు ఎలిమినేట్ చేశాడో కానీ.. అస్సలు ఊహించని కంటెస్టెంట్లను బిగ్ బాస్ ఎలిమినేట్ చేశాడు. శుభశ్రీ అనుకున్నారు కానీ.. టేస్టీ తేజ లేదా అమర్ దీప్ ను ఎలిమినేట్ చేస్తారని అనుకున్నా.. అసలు స్టార్ మా బ్యాచ్ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా ఇప్పటి వరకు ఎలిమినేట్ కాలేదు.

కానీ.. ఈ వారం ఇద్దరిని ఎలిమినేట్ చేశాడు బిగ్ బాస్. అయితే.. ఇది బిగ్ బాస్ ఉల్టా పుల్టా కదా. ఇద్దరిలో శుభశ్రీని ఎలిమినేట్ చేసి.. గౌతమ్ ను బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ కి పంపించాడట. అవును.. గౌతమ్ ను సీక్రెట్ రూమ్ కు పంపించి సరికొత్త గేమ్ షోను స్టార్ట్ చేయబోతున్నాడు బిగ్ బాస్. అలాగే.. బిగ్ బాస్ హౌస్ లోకి ఇవాళ మరికొందరు కంటెస్టెంట్లు వస్తున్నారట. ఎంత మంది కంటెస్టెంట్లు వస్తారో తెలియదు కానీ.. ప్రోమోలో మాత్రం మరో ముగ్గురు నలుగురు కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లోకి రాబోతున్నట్టు తెలుస్తోంది. అంటే.. బిగ్ బాస్ హౌస్ మళ్లీ కంటెస్టెంట్లతో నిండిపోనుంది అన్నమాట.

subhasree and gautham eliminated from bigg boss house

#image_title

Bigg Boss Telugu 7 : టాప్ కంటెస్టెంట్ ఎవరు?

ఇప్పటి వరకు 5 వారాలు పూర్తవడంతో.. ఈ 5 వారాలు చూస్తే అందరిలో ఇంటి సభ్యులు కాకుండా టాప్ కంటెస్టెంట్స్ ఎవరు అని నాగార్జున అడుగుతాడు. దీంతో ప్రశాంత్ అని టక్కున సమాధానం చెబుతాడు అమర్ దీప్. హౌస్ మెట్స్ కాకుండా నేను అడిగేది కంటెస్టెంట్ల గురించి. అందుకే కరెక్ట్ గా వినాలి అమర్ దీప్ అంటాడు నాగార్జున. దీంతో మరోసారి అమర్ దీప్ పరువు నాగార్జున ముందు పోతుంది.

శివాజీ మాత్రం యావర్ అని చెబుతాడు. గౌతమ్ శివాజీ పేరు చెబుతాడు. తేజ.. ప్రియాంక పేరు చెబుతాడు. యావర్.. శివాజీ పేరు చెబుతాడు. ఇక.. ఈ వారం డైరెక్ట్ గా ఎలిమినేషన్ తో మొదలు పెడతాడు బిగ్ బాస్. నామినేట్ అయిన వాళ్లందరినీ యాక్టివిటీ రూమ్ లోకి పంపిస్తాడు. ఎలిమినేట్ అయిన వాళ్లు అట్నుంచి అటే బిగ్ బాస్ స్టేజీ మీదికి వెళ్తారు. వాళ్లలో శుభశ్రీ, గౌతమ్ ఎలిమినేట్ అవుతారు.

ఇక.. ఈ రోజు సన్ డే కాబట్టి పూర్తిగా ఫన్ డే అయింది. హీరో సిద్ధార్థ్, రవితేజ.. ఇద్దరూ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి కంటెస్టెంట్లను కాసేపు అలరించారు. చూద్దాం అసలు ఉల్టా పుల్టా అంటే ఏంటో ఈరోజు తేలిపోనుంది.

YouTube video

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది