Sudigali Sudheer : త్వరలోనే ఆ షోకు వస్తా.. సుడిగాలి సుధీర్ అభిమానులకు గుడ్ న్యూస్
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సుధీర్ ఎక్కడి నుంచి తన కెరీర్‌ను మొదలుపెట్టాడో అందరికీ తెలిసిందే. ఎన్ని కష్టాలు పడి ఇంతటి స్థాయికి వచ్చాడో అభిమానులకు బాగా తెలుసు. అందరి చేత మాటలు పడటం, ఎంత మంది ఎన్ని రకాలుగా సెటైర్లు వేసినా కూడా లైట్ తీసుకోవడం, ఎంత స్టార్డం వచ్చినా కూడా సింపుల్‌గా ఉండటం వంటి కారణాల వల్ల సుధీర్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతూ వచ్చింది.
తాజాగా సుధీర్‌కు మల్లెమాల టీంకు గ్యాప్ వచ్చిందని, అందుకే ఢీ షో నుంచి తప్పుకున్నాడనే టాక్ గుప్పుమంది. అయితే అదే నిజమని అనుకుంటే.. శ్రీదేవీ డ్రామా కంపెనీ, జబర్దస్త్ షోలను కూడా వదిలి వెళ్లాలి. కానీ సుధీర్ అలా చేయలేదు. కేవలం ఢీ షోలోనే కనిపించడం లేదు. సినిమాలు, ఈవెంట్లు, ఇతర షోల వల్ల డేట్లు అడ్జస్ట్ కాకపోవడంతోనే ఇలా ఢీ నుంచి తప్పుకున్నాడనే టాక్ వచ్చింది.మొత్తానికి సుధీర్ లేకపోవడంతో ఢీ రేటింగ్స్ పడిపోయాయి. మొత్తానికి శ్రీదేవీ డ్రామా కంపెనీ ద్వారా అందరికీ ఓ గుడ్ న్యూస్ వచ్చింది.

Sudigali Sudheer About Clarity on Dhee Show In Sridevi Drama Company
ఈ ఆది వారం ప్రసారమైన శ్రీదేవీ డ్రామా కంపెనీలో ఓ విషయం బయటకు వచ్చింది. ఢీ షోను ఎందుకు మానేశారు అని ఓ అభిమాని వీడియో సందేశం ద్వారా సుధీర్‌ను అడిగేశారు. దీనికి సుధీర్ ఏ సమాధానం చెబుతాడా? అని అందరూ ఎదురుచూశారు.ఢీ షోని మానేశాను అని ఎవరు చెప్పారు.. కాస్త గ్యాప్ ఇచ్చా.. త్వరలోనే ఎంట్రీ ఇస్తాను అని ఢీ షో గురించి సుధీర్ చెప్పేశాడు. అంటే మొత్తానికి మళ్లీ ఢీ షోలో సుధీర్ సందడి చేయబోతోన్నాడన్న మాట.