Tamannaah : పెళ్లికి రెడీ అయిపోయిన తమన్నా… నిశ్చితార్థం, పెళ్లి తేదీలు కూడా లీక్ అయిపోయాయి..!!
Tamannaah : ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరోయిన్ లు ఇప్పుడు వరుస పెట్టి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ముఖ్యంగా కరోనా టైములో కాజల్ అగర్వాల్, ప్రణతి… అలియా, కత్రినా కైఫ్ ఇంకా పలువురు హీరోయిన్స్ పెళ్లి చేసుకోగా ఇటీవల నయనతార కూడా పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ హీరోయిన్స్ సమకాలిక ముద్దుగుమ్మ మిల్కీ బ్యూటీ తమన్నా కూడా పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ మీడియా నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి 14వ తారీకు తమన్నా నిశ్చితార్థం ఫిక్సయినట్లు వార్త లీక్ అయ్యింది. అంతేకాదు ఏప్రిల్ 21వ తారీకు పెళ్లి అన్నట్లు సమాచారం. వరుడు మరెవరో కాదు నటుడు విజయ్ వర్మ. గత కొంతకాలంగా మీడియాలో వీరిద్దరి గురించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇదే సమయంలో న్యూ ఇయర్ వేడుకలలో భాగంగా గోవాలో ఈ జంట ముద్దుల్లో మునిగితేలగా ఇప్పుడు వీరిద్దరి మధ్య బంధం మరింత బలపడినట్లు …
దీంతో పెళ్లికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. గత కొంతకాలంగా తమన్నాకీ పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఇదే సమయంలో బాలీవుడ్ పై ఫోకస్.. పెట్టిన గాని అవకాశాలు రాకపోవడంతో సింగిల్ గానే ఉండటంతో ఇంకా పెళ్లి చేసుకోవాలని నటుడు విజయ్ వర్మతో… వివాహ జీవితంలో అడుగుపెట్టడానికి మిల్కీ బ్యూటీ డిసైడ్ కావటం జరిగింది అంట. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ మరియు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది.