Baahubali : ఆ సినిమాను ‘బాహుబలి’తో పోల్చడం ఏంటీ సిగ్గు చేటు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Baahubali : ఆ సినిమాను ‘బాహుబలి’తో పోల్చడం ఏంటీ సిగ్గు చేటు

 Authored By aruna | The Telugu News | Updated on :22 August 2022,2:40 pm

Baahubali : బాహుబలి… ఇండియన్ సినీ చరిత్రలో ఇది ఒక బ్రాండ్‌. ఏ సినిమా కూడా బాహుబలి సినిమా ను బీట్ చేయలేదు. స్వయంగా రాజమౌళి మరో భారీ భారీ సినిమాను తీసినా కూడా అది బాహుబలి కి సరి రాదు అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం. అలాంటి బాహుబలి స్థాయి సినిమా అంటూ తమిళ ఫిల్మ్ మేకర్స్ మరియు మీడియా వారు ప్రచారం చేస్తున్న సినిమా పొన్నియిన్ సెల్వం. మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా రెండు పార్ట్‌ లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రెండు పార్ట్‌ లు కూడా భారీ తారాగణం తో రూపొందింది.

తమిళ స్టార్స్ తో పాటు ఐశ్వర్య రాయ్ వంటి బాలీవుడ్‌ స్టార్‌ నటి కూడా నటించడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి. అంత మాత్రాన ఈ సినిమాను బాహుబలి తో పోల్చడం విడ్డూరంగా ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాహుబలి రెండు పార్ట్‌ లకు గాను రాజమౌళి దాదాపుగా నాలుగు సంవత్సరాలకు పైగానే తీసుకున్నాడు. అలాంటి అద్భుత దృశ్య కావ్యం ను రాజమౌళి మాత్రమే ఆవిష్కరించగలడు. అలాంటిది పొన్నియిన్ సెల్వం సినిమా ను బాహుబలికి ఏమాత్రం తగ్గదు అంటూ ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

tamil movie ponniyin selvan movie vs rajamouli baahubali movie

tamil movie ponniyin selvan movie vs rajamouli baahubali movie

కేవలం 150 రోజుల్లో పొన్నియిన్‌ సెల్వం రెండు పార్ట్‌ లను తెరకెక్కించడం జరిగిందట. రెండు పార్ట్‌ లకు కూడా అతి తక్కువ సమయం తీసుకున్న మణిరత్నం ఎలా బాహుబలి స్థాయి సినిమా ను ఆవిష్కరించాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీడియా లో వస్తున్నట్లుగా వార్తలు నిజం అయ్యి ఉండవు అని.. కేవలం సినిమా పబ్లిసిటీ లో భాగంగా మా సినిమా బాహుబలి సినిమా స్థాయి లో ఉంటుందని అంటున్నారు. తప్ప బాహుబలి సాధించిన వసూళ్లలో కనీసం పావు వంతు అయినా వసూళ్లు సాధించేనా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. బాహుబలి తో పోల్చుకున్నప్పుడు కనీసం వెయ్యి కోట్లు అయినా సాధించాలి. కాని రెండు పార్ట్‌ లు కూడా ఆ స్థాయి వసూళ్లను సాధిస్తాయి అనేది నమ్మకం తక్కువ.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది