Rishab Shetty : కాంతార హీరో మాయలో పడిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఆమె ఎవరంటే..? వీరిద్దరి మధ్య అసలు ఏముందంటే…?

 Authored By prabhas | The Telugu News | Updated on :20 November 2022,3:40 pm

Rishab Shetty : సినీ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బాస్టర్ కొడుతుంటాయి. ఇక అలాంటి సినిమాల్లో ఇప్పుడు కాంతారా ఒకటి. నిజానికి ఈ సినిమా కన్నడ సినిమా అయినా తెలుగు మరియు ఇతర భాషల్లో కూడా బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా తెలుగులో దాదాపుగా 50 కోట్లు వసూలు చేసింది అని చెప్పాలి. అలాగే బాలీవుడ్ లో కూడా ఏమాత్రం తగ్గకుండా దాదాపుగా 80 కోట్లు వసూలు దాటేసింది. విడుదలైన రోజు నుండి ఈరోజు వరకు దాదాపుగా ఒక కోటి గ్రాఫ్ ను వసూలు చేసింది.

అయితే ఈ సినిమాలో హీరోగా రిషబ్ శెట్టి నటించిన విషయం తెలిసిందే. అయితే ఈయన హీరోగా చేయడంతో పాటు, ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. ఇక ఈ కాంతారా సినిమాతో రిషబ్ శెట్టి హీరోగా డైరెక్టర్ గా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నాడు. అయితే ఈ సినిమా కంటే ముందే రిషబ్ శెట్టికి మంచి డైరెక్టర్ గా గుర్తింపు ఉంది. రక్షిత్ శెట్టి మరియు రష్మిక మందన హీరో హీరోయిన్గా నటించిన కిరాక్ పార్టీ అనే సినిమా ను తెరకెక్కించినది రిషబ్ శెట్టి . ఈ సినిమా విజయంతో రిషబ్ శెట్టి మంచి డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు. ఇక ఇప్పుడు కాంతారా సినిమాతో నటుడుగా డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడు.

Tollywood star heroine who fell in love with Kantara hero Rishab Shetty

Tollywood star heroine who fell in love with Kantara hero Rishab Shetty

ఇక త్వరలోనే రిషబ్ శెట్టి ఎన్టీఆర్ తో కూడా సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే గతంలో ఓ హీరోయిన్ తో రిషబ్ శెట్టి లవ్ లో ఉన్నట్లుగా వార్తలు వినిపించాయి. ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు టాలీవుడ్ హీరోయిన్ హరిప్రియ. అయితే ఈమె టాలీవుడ్ లో పెద్దగా గుర్తింపు సాధించుకోలేదు. దీంతో సాండల్ వుడ్ లో అడుగ పెట్టింది. దీంతో హరిప్రియ తో రిషబ్ ప్రేమ సాగుతుందని , త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే రిషబ్ శెట్టి హరిప్రియ తో కలిసి రిక్కీ అనే సినిమాను చేశాడు. ఈ సినిమా యొక్క షూటింగ్ ఎక్కువగా కాశ్మీర్ లో జరిగింది. అయితే ఈ సినిమా తర్వాత వీరిద్దరి మధ్య వ్యవహారం గురించి వార్తలు ఆగిపోయాయి. అలాగే రిషబ్ శెట్టి , తన స్నేహితురాలైన ప్రగతి శెట్టిని పెళ్లి చేసుకున్నాడు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి