Balakrishna : తన డైలాగ్‌ని చెప్పమన్న బాలకృష్ణ.. ఉలిక్కిపడ్డ మహేష్ బాబు.. అన్‌స్టాపబుల్ ప్రోమో
Unstoppable : నందమూరి బాలకృష్ణ ఆహా అనే ఓటీటీ కోసం హోస్ట్‌గా మారిన విషయం తెలిసిందే. అన్‌స్టాపబుల్ అంటూ బాలయ్య చేస్తున్న సందడి మాములుగా లేదు. బాలకృష్ణ ఎన్నో సంవత్సరాలుగా సినిమాల్లో మాస్ హీరోగా ప్రేక్షకులను అలరిస్తూ వచ్చారు. బాలయ్య అంటే పేరు కాదు.. ఇట్స్ ఏ బ్రాండ్ అనిపించుకునేలా సక్సెస్ అయ్యారు. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ కూడా బాలయ్య ఎలా ఉంటారో చాలామందికి తెలుసు. కానీ ఆయన ఒక హోస్ట్‌గా సరదాగా కబుర్లు చెప్తూ ఉంటే.. ఎలా ఉంటుందో మాత్రం ఎవరికీ తెలియదు. బాలయ్యలో ఆ యాంగిల్‌నే బయటపెట్టింది అన్‌స్టాపబుల్ షో.
అన్‌స్టాపబుల్ షోలో మోహన్ బాబు (ఫ్యామిలీ), నాని, బ్రహ్మానందం, అనీల్ రావిపూడి, అఖండ టీమ్, రాజమౌళి, కీరవాణి, వంటి గెస్ట్‌లతో ‘అన్‌స్టాపబుల్’ వినోదాన్ని పంచారు బాలయ్య. రవితేజ- గోపీచంద్ ఇలా పలువురు సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు.సీజన్ చివరిగా మహేష్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. అయితే ఫిబ్రవరి 4న ఈ టాక్ షో స్ట్రీమింగ్ కానుండగా, దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో మహేష్‌ని ఇంత యంగ్ ఉన్నావేంటయ్య బాబు అని బాలయ్య అనడం హైలైట్. తన డైలాగ్‌ని చెప్పమని మహేష్‌ని బాలయ్య కోరగా, దానికి మీ డైలాగ్ మీరు తప్ప ఎవరు బాగా చెప్పలేరని అనడంతో పాటు చివరలో పెళ్లి గురించి బాలయ్య వేసిన సెటైర్ ప్రోమోకి హైలైట్.

unstoppable latest promo released
Balakrishna : ప్రోమో అదిరింది..
‘ఆహా’ వేదికగా ప్రసారమవుతోన్న ఈ షో.. సరికొత్త రికార్డు సృష్టించింది. ఇండియన్ మూవీ డేటా బేస్ (ఐఎమ్‌డీబీ) విడుదల చేసిన రేటింగ్స్‌లో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీ.. టాప్ 10 రియాలిటీ షోలలో 5వ ప్లేస్ లో నిలిచి రికార్డు నెలకొల్పింది. ఇక బాలయ్య ఎంత తీసుకుంటున్నారనేది అంతటా హాట్ టాపిక్ గా మారింది. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఫస్ట్ సీజన్ కు బాలయ్యకు వచ్చిన రెమ్యూనిరేషన్ జస్ట్ 25 లక్షలు మాత్రమే అంటున్నారు. ఎపిసోడ్ కు 25 లక్షలు వంతును మొత్తం సీజన్ కు రెండున్నర కోట్లు ఇచ్చారు అన్నమాట. అయితే షో ఇంత బ్లాక్ బస్టర్ అయింది కనుక రెండో సీజన్ కు ఎమౌంట్ రెట్టింపు అవుతుందని చెప్తున్నారు.
