Varun tej Lavanya Tripati : ప్రపంచానికి భారీ షాక్ ఇచ్చిన వరుణ్ తేజ్ – లావణ్య .. ఎంగేజ్మెంట్ తరవాత రోజే !
Varun tej Lavanya Tripati : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలోనే తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. చాలా రోజులగా సోషల్ మీడియాలో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇదంతా ఫేక్ అంటూ జనాలు కొట్టి పడేశారు. కానీ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి అందరిని ఒక్కసారిగా షాకింగ్ కి గురి చేశారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఇన్నాళ్లు సైలెంట్ గా లావణ్య త్రిపాఠిని ప్రేమించిన వరుణ్ శుక్రవారం రోజు హైదరాబాదులో గ్రాండ్ గా నిశ్చితార్థం జరుపుకున్నాడు. దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేశారు.
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ సమక్షంలో శుక్రవారం రోజు ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్గా జరిగింది. దీంతో సోషల్ మీడియాలో వీరి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే వీరిద్దరి పెళ్లి ఎప్పుడు ఉంటుంది, ఆ వెడ్డింగ్ డెస్టినీ ఎక్కడ ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం వీరిద్దరి పెళ్లి ఇటలీలో జరగబోతుందట. దానికి కారణం కూడా ఉంది. వీళ్ళ ప్రేమ చిగురించింది ఇటలీలోనే. మనకు తెలిసిందే లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ కలిసి ‘ మిస్టర్ ‘ సినిమాలో నటించారు.
ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారింది. అందుకే తమ ప్రేమకు గుర్తుగా ఇటలీలో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారట. ఇందుకు మెగా ఫ్యామిలీ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ఏదేమైనా లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ లు చాలా సైలెంట్ గా ప్రేమించుకొని అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. అప్పటినుంచి సోషల్ మీడియాలో వీరిద్దరి ప్రేమ గురించి వార్తలు వస్తున్నా అది నిజం కాదని కొట్టి పడేశారు. కానీ ఇప్పుడు అదే నిజమైంది.