Venu swamy : అఖిల్ జాతకం చెప్పిన వేణు స్వామి .. అతడిని దేవుడే కాపాడాలంటూ కామెంట్స్ .. !!
Venu Swamy : తెలుగు పరిశ్రమలో అక్కినేని ఫ్యామిలీకి ఎటువంటి గౌరవం ఉందో అందరికీ తెలుసు. అక్కినేని నాగేశ్వరరావు నుంచి మూడు తరాల వారు హీరోలుగా మారారు. నాగార్జున తర్వాత అఖిల్, నాగచైతన్య హీరోలుగా మారారు. అయితే హీరోలు గా నాగేశ్వరరావు నాగార్జునకు వచ్చిన ఇమేజ్ నాగ చైతన్య, అఖిల్ కు రాలేదు. అందుకు కారణం వారి జాతకంలో ఉన్న లోపమే అని ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి తెలిపారు. సినీ పరిశ్రమలో వేణు స్వామి గురించి తెలియని వారు ఉండరు. సెలబ్రిటీల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారారు.
అయితే తాజాగా వేణు స్వామి అఖిల్ జాతకం గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. నాగచైతన్య విడాకులు తీసుకుంటాడని వేణు స్వామి ముందే చెప్పారు. కానీ అప్పుడు ఎవరు నమ్మలేదు. ఆ తర్వాత అదే జరగడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు అఖిల్ విషయంలోను వేణు స్వామి సంచలన విషయాన్ని బయటపెట్టారు. అఖిల్ జాతకం ఇప్పుడు అసలు బాగోలేదని అన్నారు. అయితే ఆయన జాతకం బాగుండాలంటే ఒక పని చేయాలి అని అన్నారు. అఖిల్ ఎప్పటినుంచైతే తల్లి మాట వినకుండా ఉంటాడో అప్పుడే తన జీవితం బాగుంటుంది అని అన్నారు. ఈ విషయంలో నాగార్జున కలగజేసుకుని అఖిల్ జీవితాన్ని సరిదిద్దాలని అన్నాడు.
నాగార్జున చెప్పిన విషయాలను అఖిల్ వింటే బాగుంటుంది అని అన్నారు. ఇక నాగచైతన్య అఖిల్ కు తమ పర్సనల్ విషయాలలో కూడా విషాదాలు వెంటాడుతున్నాయి. నాగచైతన్య సమంతను పెళ్లి చేసుకున్న కొద్ది కాలానికి విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటూ సినిమాలపై పూర్తి దృష్టి పెట్టారు. ఇక అఖిల్ కూడా నిశ్చితార్థం చేసుకున్న తర్వాత సడన్గా పెళ్లి ఆగిపోయింది. ఇలా అక్కినేని వారసులు తమ జాతకంలో ఉన్న లోపాల వలన కలిసి రావడం లేదని వేణు స్వామి చెబుతున్నారు.