KL Rahul : కేఎల్ రాహుల్, అతియా మ్యారేజ్ ముహూర్తం ఫిక్స్.. పెళ్లి ఎక్కడో తెలుసా?
KL Rahul : కేఎల్ రాహుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ పెళ్లి గురించే ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. బాలీవుడ్ నటి అథియా శెట్టితో చాలా రోజుల నుంచి కేఎల్ రాహుల్ డేటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇద్దరూ చాలా రోజులు కలిసి తిరిగారు. అయితే.. ఇద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అనే దానిపై క్లారిటీ రాలేదు. కానీ..
ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అథియా శెట్టిను త్వరలోనే కేఎల్ రాహుల్ పెళ్లి చేసుకోబోతున్నాడట. వాళ్ల పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ అయిందట. పక్కాగా ప్లాన్ చేసుకొని ఇద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తెలుస్తోంది.డిసెంబర్ చివరి వారంలో లేదా జనవరి ఫస్ట్ వీక్ లో వీళ్లు పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. తమ పెళ్లి వేదికను మాత్రం బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టికి చెందిన బంగ్లా జహాన్ ను సెలెక్ట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఇది సునీల్ శెట్టి గెస్ట్ హౌస్.

venue fixed for kl rahul and athiya wedding
KL Rahul : సునీల్ శెట్టి బంగ్లా జహాన్ లో పెళ్లి
ఇది ముంబైకి సమీపంలోని ఖండాలాలో ఉంది. ఇక.. వీళ్ల వివాహానికి పలువురు సినీ, స్పోర్ట్స్ ప్రముఖులు రానున్నట్టు తెలుస్తోంది. చాలా తక్కువ మందినే పెళ్లికి పిలిచినట్టు తెలుస్తోంది. అందుకే సింపుల్ గా వివాహ వేడుకను నిర్వహించాలని కేఎల్ రాహుల్, అతియా భావిస్తున్నారట. ప్రస్తుతానికి వీళ్లు ముంబైలో ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నట్టు తెలుస్తోంది. ఇక.. సునీల్ శెట్టి బంగ్లానే తన పెళ్లికి వీళ్లు ఎంచుకోవడానికి కారణం.. అది ఒక చారిత్రక ప్రదేశం. దాన్ని దాదాపు 20 ఏళ్ల కింద నిర్మించారు. ఖండాలా అనే ప్రాంతంలో చుట్టూ పచ్చని చెట్లు ఉండగా.. చెట్ల మధ్యలో ఈ బంగ్లా ఉంటుంది. అందుకే దాన్ని వాళ్లు ఎంచుకున్నట్టు తెలుస్తోంది.