Kota Srinivas Rao Jr NTR : ఎన్టీఆర్ తర్వాతే ఎవడైనా.. సీనియర్ యాక్టర్ కోటా మాటలకు ఇతర హీరోల ఫ్యాన్స్ హర్ట్..!
Kota Srinivas Rao Jr NTR : టాలీవుడ్ హీరోల్లో తనకు ఇష్టమైన హీరో ఎన్టీఆర్ అని అంటున్నారు కోటా శ్రీనివాస్ రావు. ఎన్టీఆర్ తర్వాతే ఎవడైనా అంటూ సంచలన కామెంట్స్ చేశారు. యాక్టింగ్, డ్యాన్స్ ఇలా అన్నిటిలో ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా అని అన్నారు కోటా శ్రీనివాస్ రావు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విలన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కోటా శ్రీనివాస్ రావు ప్రస్థానం గురించి తెలిసిందే. అలాంటి గొప్ప నటుడు మిగతా హీరోలను తక్కువ చేస్తూ ఎన్టీఆర్ మాత్రమే గొప్ప నటుడని కొనియాడటం మిగతా హీరోల ఫ్యాన్స్ ని హర్ట్ అయ్యేలా చేస్తుంది. ఎన్.టి.ఆర్ లోని టాలెంట్ ని చిన్న వయసులోనే సీనియర్ ఎన్టీఆర్ గుర్తించారని అందుకే ఆయన ఒళ్లి కూర్చో బెట్టుకుని విజయ తిలకం దిద్దారని అన్నారు.
Kota Srinivas Rao Jr NTR ఎన్టీఆర్ తర్వాత మహేష్, అల్లు అర్జున్..
ఎన్టీఆర్ తర్వాత మహేష్, అల్లు అర్జున్ లు కూడా మంచి నటులే కానీ వీళ్లంతా ఎన్టీఆర్ తర్వాతే అంటున్నారు కోటా శ్రీనివాస రావు. ఐతే ఎన్టీఆర్ పొట్టిగా ఉంటాడని కామెంట్స్ చేస్తారు. చంద్ర మోహన్ కూడా పొట్టిగా ఉంటాడు కానీ ఆయన నట ప్రస్థానం తెలిసిందే. ఎవరికి చంద్ర మోహన్ పోటీ కాదు ఆయనకు ఎవరు పోటీ కాదని అన్నారు. ఎన్టీఆర్ పై ఇప్పుడే కాదు ఇదివరకు కూడా కోటా తమ అభిమానాన్ని పంచుకున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ను కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండగా అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Kota Srinivas Rao Jr NTR : ఎన్టీఆర్ తర్వాతే ఎవడైనా.. సీనియర్ యాక్టర్ కోటా మాటలకు ఇతర హీరోల ఫ్యాన్స్ హర్ట్..!
దీనితో పాటుగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి వార్ 2 సినిమా చేస్తున్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా తో స్ట్రైట్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు ఎన్టీఆర్. ఆయన అంత గొప్ప నటుడు అయ్యుండి ఒక హీరోని మాత్రమే ఇలా పొగడటం గురించి తెలుగు ఆడియన్స్ ఇబ్బంది పడుతున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో ప్రభాస్, అల్లు అర్జున్, రాం చరణ్ కూడా తమ స్టామినా చూపిస్తున్న ఈ టైం లో కేవలం ఎన్టీఆర్ గొప్ప అన్నట్టు కోటా గారి మాటలు ఫ్యాన్స్ ని హర్ట్ చేస్తున్నాయి.