Pavitra Lokesh : పవిత్రా లోకేష్ అసలు బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. కలెక్టర్ కావాల్సిన పవిత్ర యాక్టర్ ఎందుకు అయింది?
Pavitra Lokesh : తెలుగు సీనియర్ నటుడు నరేష్ గురించి మాట్లాడగానే టక్కున గుర్తొచ్చే మరో పేరు పవిత్రా లోకేశ్. అవును.. వీళ్లిద్దరూ క్యారెక్టర్ ఆర్టిస్టులే. ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. అప్పుడే వీళ్ల మధ్య ప్రేమ చిగురించింది. చివరకు ఇద్దరూ కలిసి కొన్నేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నారు. పెళ్లి అయితే చేసుకోలేదు కానీ.. ఇద్దరూ కలిసే ఉంటున్నట్టు సమాచారం. అవన్నీ పక్కన పెడితే.. అసలు నరేష్ వల్లనే పవిత్రా లోకేశ్ కు చాలా పేరు వచ్చింది. తను తెలుగులో చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఎప్పుడూ తనకు అంతగా పేరు రాలేదు. అయితే.. నరేష్ తో పరిచయం పెంచుకున్నప్పటి నుంచి..
నరేష్ తో పాటు తను కూడా ట్రెండ్ అవుతుండటంతో అందరూ తన గురించి వెతకడం ప్రారంభించారు. దీంతో గూగుల్ లో తనే ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. మీడియా కూడా పవిత్రపై ఫోకస్ పెంచింది. అయితే.. పవిత్రది కర్ణాటక. తన తండ్రి కన్నడ నటుడు. అందుకే.. తనకు కూడా చిన్నప్పటి నుంచి సినిమా రంగం మీద ఆసక్తి ఏర్పడింది. తన తండ్రి చనిపోయిన తర్వాత పొట్టకూటి కోసం పలు సినిమాల్లో నటించింది పవిత్ర. ఓవైపు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూనే.. మరోవైపు సివిల్స్ కు ప్రిపేర్ అయింది పవిత్ర. ఐఏఎస్ కావాలన్నదే తన లక్ష్యం. అదే దిశగా తను అడుగులు వేసింది. తన కాళ్ల మీద తాను నిలబడేందుకు చిన్నతనం నుంచే వెండితెర, బుల్లితెర మీద నటించడం స్టార్ట్ చేసింది.
Pavitra Lokesh : తండ్రి చనిపోయిన తర్వాత సినిమాల్లో నటించడం స్టార్ట్ చేసిన పవిత్ర
1994 లోనే అంబరీష్ హీరోగా వచ్చిన మిస్టర్ అభిషేక్ అనే సినిమాలో నటించింది. కొన్నేళ్ల పాటు హీరోయిన్ గా నటించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెటిల్ అయిపోయింది. సినిమాల్లో బిజీ అయిపోగానే సివిల్స్ ను వదిలేసింది. కన్నడ, తెలుగులో మంచి ఆఫర్స్ రావడంతో సినిమాలు చేస్తూ వెళ్లిపోయింది. పవిత్ర భర్త సుచేంద్ర ప్రసాద్.. టీవీ సీరియల్ నటుడు. ఇద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. దానికంటే ముందే పవిత్రకు ఒక పెళ్లయి విడాకులు తీసుకుంది. సుచేంద్రతోనూ గొడవలు రావడంతో ఇద్దరూ దూరంగా ఉన్నారు. నరేష్ తో నటిస్తున్న సమయంలో.. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది అందరికీ తెలిసిందే.