Mohan Babu : వేర్ ఈజ్ మోహన్ బాబు.. రిస్క్ అని తెలిసినా సరే ఇలా చేస్తున్నారెందుకు..?
ప్రధానాంశాలు:
Mohan Babu : వేర్ ఈజ్ మోహన్ బాబు.. రిస్క్ అని తెలిసినా సరే ఇలా చేస్తున్నారెందుకు..?
Mohan Babu : తన ఫ్యామిలీతో జరుగుతున్న గొడవల్లో భాగంగా రిపోర్టర్ చెవికి గాయాన్ని చేశారు హీరో మంచు మోహన్ బాబు. ఆ కేసు విషయంలో పోలీసులు ఆయన్ని విచారణకు హాజరు కావాలని కోరారు. ఐతే అప్పుడు తనకు అనారోగ్యంగా ఉందని 24 వరకు గడువు ఇవ్వాలని అడిగారు. ఈలోగా హైకోర్ట్ లో ముందస్తు బెయిల్ అప్లై చేయగా అది కాస్త రివర్స్ కొట్టింది. ఐతే పోలీసులకు ఇచ్చిన డేట్ నిన్నటితో ముగిసింది. మోహన్ బాబు కి మళ్లీ పోలీసులు నోటీసులు పంపిస్తున్నారు. ఈసారి ఆయన విచారణకు సహకరించకపోతే అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఐతే ఈ టైం లో మోహన్ బాబు హైదరాబాద్ వదిలి వెళ్లినట్టు తెలుస్తుంది. అసలు ఆయన దేశం లోనే లేడు దుబాయ్ వెళ్లాడని కొందరు అంటున్నారు.
Mohan Babu మీడియాలో వచ్చిన వార్తలకు..
కేసు విచారణలో పాల్గొని ఆ తర్వాత అరెస్ట్ ఛాన్స్ ఉందని అనుకుంటే బెయిల్ వచ్చే ఏర్పాట్లు చేయాలి కానీ ఇలా ఊరు వదిలి వెళ్తే మాత్రం ఘోర తప్పిదం అవుతుంది. ఐతే ఇప్పటికే పోలీసులు ఇచ్చిన గడువు తీరిందని జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటికి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు.అంతకుముందు మోహన్ బాబు పారిపోయాడని మీడియాలో వచ్చిన వార్తలకు తాను ఇంట్లోనే ఉన్నానని సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. కానీ ఇప్పుడు అసలు ఆయన ఆన్ లైన్, ఆఫ్ లైన్ రెండిటిలో లేడు.
మోహన్ బాబు ఆచూకి కోసం పోలీసులు వేట మొదలైంది. విచారణ రాకుండా ఎన్నాళ్లని మోహన్ బాబు తప్పించుకుంటారు. పోలీసులతో ఆటలు ఆయనకు మంచిది కాదని నెటిజన్లు అంటున్నారు. ఈ కేసు విషయంలో మోహన్ బాబుని అరెస్ట్ చేస్తారని ఇప్పటికే ఒక రేంజ్ లో ప్రచారం జరుగుతుంది. ఐతే మోహన్ బాబు ఇలా భయపడి పారిపోయే టైపు మనిషి కాదు మరి ఆయన ఎందుకు ఇలా చేస్తున్నాడు అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా పోలీసులకు మోహన్ బాబు సహకరిస్తేనే ఆయనకు మంచిదని ఆయన ఫ్యాన్స్ కూడా కోరుతున్నారు. Mohan Babu, Machu Mohan Babu, Reporter Case, Manchu Family Fight