Health Benefits : ఫుట్ అల్సరా..? అస్సలు నిర్లక్ష్యం చేయకండి… ఈ చిన్న చిట్కాతో ఖతం చేయండి
Health Benefits : డయాబెటిస్‌ను లైఫ్ స్టైల్ డిసీజ్ అంటారు. చేసే పనులు, తినే తిండి, శరీర బరువు వంటివి షుగర్ వ్యాధిని డిసైడ్ చేస్తాయి. బరువు ఎక్కువగా ఉండడం, ఆరోగ్యాన్నిచ్చే తిండికి దూరంగా ఉండడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం వంటివన్నీ డయాబెటిస్‌ను మోసుకొస్తాయి. వారసత్వంగా కూడా అది ఎటాక్ చేసే ముప్పుంది. మధుమేహం లేదా షుగర్ వ్యాధిని వైద్య పరిభాషలో డయాబెటిస్ మెల్లిటస్ అని వ్యవహరిస్తారు. మూత్రం ఎక్కువగా రావడం, దాహం ఎక్కువ కావడం, ఎంత తిన్నా ఆకలిగా ఉండడం, చూపు తగ్గడం, అలసట, గాయాలు మానకపోవడం వంటి లక్షణాలతో డయాబెటిస్ ను గుర్తించవచ్చు.అయితే డయాబెటిస్ రోగుల పాదాలలో వచ్చే అల్సర్ అనేది మధుమేహం పై తక్కువ నియంత్రణను కలిగి ఉండే వారిలో వచ్చే ఒక సాధారణ సమస్య.
దీని ప్రభావం వల్ల పాదాల అడుగు భాగంలో ఉండే చర్మ కణజాలాలు విచ్చిన్నమవుతాయి. ఇలాంటి పరిస్థితులను కాలి బొటనవేలు, పాదాల అడుగు భాగం లో చూడవచ్చు. ఇది కాళ్ల చుట్టూ మాత్రమే కాకుండా పాదం అడుగు భాగంలో ఉన్న ఎముకలను కూడా ప్రభావితం చేస్తుంది.పాదాలు బాగా ఎండిపోయి పగిలిపోతుంది. అలాగే అసాధారణమైన వాపును, చికాకును, ఎరుపుదనాన్ని, పాదాల అడుగు నుండి దుర్వాసన రావడం వంటి లక్షణాలను ఫుట్ అల్సర్ తెలియజేస్తుంది. పాదాలపై ఏర్పడిన పుండు చుట్టూ ఉన్న పరిసర కణజాలాలు నల్లగా మారడం. ఆ పుండు చుట్టూ ఉన్న ప్రాంతంలో ఆరోగ్యకరమైన రక్తప్రవాహం సరఫరా కాలేనప్పుడు ఇలా సంభవిస్తుంది.మధుమేహ రోగులలో కాళ్ల నొప్పులు సంభవించడానికి గల కారణం పాదాలలో రక్త ప్రసరణ సరిగా లేకపోవటం,

health benefits diabetes foot ulcer in pumpkin seeds lettuce black beans avocados dark chocolate
Health Benefits : ఫుట్ అల్సర్ లక్షణాలు..
రక్తంలో అధిక చక్కెర స్థాయిలు, రక్తనాళాలకు నష్టం వాటిల్లడం, పాదాల అడుగున గాయాలు, పాదాలు చికాకును కలిగి ఉండటం వంటివి మొదలైనవి. అయితే కొన్ని సహజ చిట్కాలు పాటించి ఈ వ్యాధిని నయం చేయవచ్చు.యాంటీ బ్యాక్టీరియల్, యాంటివైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీఆక్సిడెంట్ వంటి లక్షణాలను తేనె కలిగి ఉన్న కారణంగా చేత డయాబెటిక్ ఫుట్ అల్సర్లను నివారించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే డీ విటామిన్ అందేలా మార్నింగ్ కాసేపు ఎండలో ఉండాలి.మెగ్నీషియం లోపం అనేది బలహీనమైన రోగనిరోధక వ్యవస్థకు కారణం. గుమ్మడి కాయ విత్తనాలు, పాలకూర, బ్లాక్ బీన్స్, అవకాడోలు, డార్క్ చాక్లెట్, అరటిపండ్లలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇవి డయాబెటిస్ కు చక్కటి ఆహారం. అలాగే అరికాళ్లను ఎప్పుడూ పొడిగా ఉంచాలి. సరైన వర్కౌట్లు చేయాలి.